ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buffer Zone: హిమాయత్‌సాగర్‌కు హైడ్రా బుల్డోజర్లు!

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:31 AM

హైడ్రా బుల్డోజర్ల తదుపరి అడుగులు హిమాయత్‌సాగర్‌ వైపేనా..? జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న ప్రముఖుల అతిథిగృహాలు, ఇతర ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమవుతోందా..?

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌పై 1-2 రోజుల్లో స్పష్టత

  • 2-3 రోజుల్లో నివేదిక.. ఆ తరువాత చర్యలు

  • సర్కారు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ,

  • వాటర్‌ బోర్డ్‌ సర్వే.. 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు

  • వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖల అతిథి గృహాలు

హైదరాబాద్‌ సిటీ, రామచంద్రాపురం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హైడ్రా బుల్డోజర్ల తదుపరి అడుగులు హిమాయత్‌సాగర్‌ వైపేనా..? జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న ప్రముఖుల అతిథిగృహాలు, ఇతర ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమవుతోందా..? అంటే.. విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌పై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని.. ఆ తర్వాత కూల్చివేతలుంటాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.


వారంరోజులుగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న వాటర్‌ బోర్డు, నీటిపారుదల శాఖ అధికారులు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణపై ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశముందని వాటర్‌బోర్డు అధికారి ఒకరు తెలిపారు. పది నిర్మాణాల వరకూ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నట్టు గుర్తించారని ప్రాథమిక సమాచారం. ఇందులో ఆరు భవనాలు కాగా.. మిగతావి ప్రహరీ గోడలు, తాత్కాలిక నిర్మాణాలుగా సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల నిర్మాణాలూ ఉన్నట్టు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా హైడ్రా తదుపరి చర్యలు తీసుకోనుంది.


  • విమర్శలకు చెక్‌ పెట్టేలా..

గండిపేట ఎఫ్‌టీఎల్‌/బఫర్‌ జోన్‌లో ఆక్రమణలను హైడ్రా ఈ నెల 11న నేలమట్టం చేసింది. ఖానాపూర్‌, చిలుకూరు ప్రాంతాల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల భవనాలను కూల్చివేసింది. అయితే, ఎఫ్‌టీఎల్‌ నోటిఫై కాలేదన్న కారణంతో హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణలను మాత్రం తొలగించలేదు. అధికార పార్టీ నేతల నిర్మాణాలున్నందునే చర్యలు తీసుకోలేదన్న విమర్శల నేపథ్యంలో సత్వర సర్వేకు సర్కారు ఆదేశించినట్టు సమాచారం.


దీంతో పాత రికార్డులు, ఇతర వివరాలను పరిశీలించడంతోపాటు క్షేత్రసాయిలో పర్యటించిన వాటర్‌బోర్డు, నీటిపారుదల శాఖల అధికారులు జలాశయం ఎఫ్‌టీఎల్‌/బఫర్‌ జోన్‌ నిర్ధారణపై అంచనాకు వచ్చినట్టు తెలిసింది. అక్కడి నిర్మాణాలు అధికార పార్టీకి చెందిన వారివి అయినా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హైడ్రాను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. వచ్చే వారం హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణల తొలగింపు ఉంటుందని ఓ అధికారి తెలిపారు.


  • తెల్లాపూర్‌లో..

హైదరాబాద్‌ నగర శివార్లలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోనూ మూడు చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. పలు నిర్మాణ సంస్థలు తప్పుడు ధ్రువీకరణలు, ఎన్‌వోసీలతో భూములు ఆక్రమించుకుని అధికారుల సహకారంతో చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో దర్జాగా నిర్మాణాలు చేపట్టాయి. కాలువలు పూడ్చి వేసి/కాలువల దిశను తమకు అనుకూలంగా మార్చుకుని.. బాక్స్‌ కల్వర్టులను నిర్మించుకున్నాయి. దీంతో వరద కాలువలు స్వేచ్ఛగా చెరువులోకి ప్రవహించే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు గ్రామంలోని పర్యావరణ ప్రేమికులు పలు ఉద్యమాలు చేశారు. అయినా అక్రమార్కులు, అధికారులు పట్టించుకోకపోవడంతో.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను (ఎన్జీటీ) సైతం ఆశ్రయించారు. చె


రువుల పై భాగంలో ఎటువంటి నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వరాదంటూ ఎన్‌జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడానికి సాహసించలేదు. కానీ, కొందరు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఎన్‌జీటీ న్యాయమూర్తుల బృందం.. స్థానిక తహశీల్దార్‌, మునిసిపాలిటీ కమిషనర్‌, ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ, లేక్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులతో కలిసి చెరువులను పరిశీలించింది. అక్కడ మేళ్ల చెరువు పైభాగంలో ఒక నిర్మాణ సంస్థ కట్టిన 32 అంతస్తుల భవనాన్ని చూసి.. ఒక న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చెరువులో ఇంత పెద్ద భవనం కంటికి కనిపించడం లేదా’’ అని మండిపడ్డారు. వెంటనే దాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. అయినా అధికారులు స్పందించలేదు.


  • ఎఫ్‌టీఎల్‌ ఎక్కువగా ఉండటంతో..

తెల్లాపూర్‌లోని మూడు చెరువుల శిఖం కంటే ఎఫ్‌టీఎల్‌ పరిధి అధికంగా ఉండటం వల్లే బిల్డర్లు మునుగుడు పట్టాలను కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల ప్రకారం.. వనం చెరువుకు 38 ఎకరాల శిఖం ఉండగా, 20 ఎకరాల ఎఫ్‌టీఎల్‌ ఉంది. ఇక్కడ చెరువులో ఓ రైస్‌మిల్‌, ఒక బార్‌, జిమ్‌ను ఏర్పాటు చేశారు. మేళ్ల చెరువు శిఖం 27 ఎకరాలు ఉండగా, 65 ఎకరాల ఎఫ్‌టీఎల్‌ ఉంది. ఇక్కడ 32 అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. ఓ ప్రముఖ సిమెంట్‌ సంస్థ విల్లాలు, అపార్టుమెంట్లను నిర్మించింది. ప్రస్తుతం ఇక్కడి మామిడి తోటకు ఆనుకుని నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.


ఇక, చెలికుంట చెరువు శిఖం 12 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. 50 ఎకరాల ఎఫ్‌టీఎల్‌ ఉంది. ఇటీవల ఓ సంస్థ అందులో క్లబ్‌ హౌస్‌ను నిర్మించింది. గురువారం రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు ఎఫ్‌టీఎల్‌లోని ప్రహరీని కూల్చారుగానీ, అసలు క్లబ్‌ హౌస్‌ను కూల్చకపోవడంపై విమర్శలువెల్లుతుతున్నాయి. కాగా.. మేళ్లచెరువు, చెలికుంట చెరువులను మట్టితో పూడుస్తూ చెరువు పై భాగంలో ఎత్తును పెంచుతూ హద్దులను మార్చడంలో నగర శివారుప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉంది. ఒక ప్రజాప్రతినిధి దగ్గరుండి చెరువులో ప్రహరీ కోసం బేస్‌మెంట్‌ కట్టించారు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ఈ అంశాన్ని వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. తాజాగా.. చెరువులను ఆక్రమించి వెలిసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న.. నేపథ్యంలో తెల్లాపూర్‌ చెరువుల కబ్జాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న చర్చ జరుగుతోంది.


జన్వాడ ఫామ్‌హౌ్‌సపై ఆర్డీవోకు సర్వేయర్ల నివేదిక

  • ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం

  • రాంనగర్‌ మణెమ్మ గల్లీ రోడ్డు, నాలాపై చర్యలు

  • మూడంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు

  • ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే.. అలసత్వం వద్దు

  • సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

  • ఆర్డీఓకు అందించిన సర్వేయర్లు

శంకర్‌పల్లి, ఆగస్టు 30: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధీనంలోని జన్వాడ ఫామ్‌హౌ్‌సపై నివేదిక సిద్ధమైంది. సర్కారు ఆదేశాల నిమిత్తం మూడు రోజుల క్రితం బుధవారం.. ఈ ఫామ్‌హౌస్‌ వద్ద రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. మర్నాడు కూడా సర్వే చేస్తామని చెప్పినప్పటికీ.. బుధవారం నాటి సర్వేనే పైనల్‌ చేశారు. ఈమేరకు సర్వేయర్లు నివేదికను తయారు చేసి ఆర్డీవోకు పంపారు. ఆర్డీవో దాన్ని కలెక్టర్‌కు పంపించనున్నారు.


నివేదికను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ తీసుకునే నిర్ణయం ఆధారంగా ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నారు. కాగా.. బుల్కాపూర్‌ నాలను ఆక్రమించి ఈ ఫామ్‌హౌస్‌ ప్రహరీ గోడ కట్టినట్లు 2020లో చేసిన సర్వేలోనే అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా చేసిన సర్వేలో మరికొంత ఎక్కువగానే ఆక్రమణలను గుర్తించినట్లు సమాచారం. బుల్కాపూర్‌ నాలా ఈ ఫామ్‌హౌస్‌ ప్రాంతంలోనే కాక మరికొన్నిచోట్ల కూడా ఆక్రమణలకు గురైంది. వాటినీ తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Aug 31 , 2024 | 03:31 AM

Advertising
Advertising