ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallannasagar Project: మల్లన్నసాగర్‌.. భూకంప జోన్‌లో!

ABN, Publish Date - Sep 06 , 2024 | 03:14 AM

ఎలాంటి పరిశోధనలు, అధ్యయనాలు చేయకుండానే భూకంప జోన్‌లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారంటూ ప్రచురితమైన కథనాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.

  • అధ్యయనం లేకుండానే నిర్మించారు: కాగ్‌

  • సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్జీటీ

  • 11న చెన్నై బెంచ్‌లో తదుపరి విచారణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి పరిశోధనలు, అధ్యయనాలు చేయకుండానే భూకంప జోన్‌లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారంటూ ప్రచురితమైన కథనాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. సమగ్ర అధ్యయనాలు చేయకుండానే భూకంప జోన్‌లో మల్లన్నసాగర్‌ను నిర్మించారంటూ తప్పుపట్టిన కాగ్‌ నివేదికను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. దాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ.. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, జిల్లా కలెక్టర్‌, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. గత నెల 7న విచారణ జరిపిన చెన్నై ధర్మాసనం.. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును సందర్శించి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌, నీటిపారుదల శాఖను ఆదేశించింది.


తదుపరి విచారణను 11న చేపట్టనుంది. గత ఏడాది సిక్కింలోని లోహ్నాక్‌ వాగుకు గండిపడడంతో తీస్తా నదిపై చుంగ్తాంగ్‌ వద్ద నిర్మించిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కమ్‌ డ్యామ్‌ కొట్టుకుపోయి ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. దీన్ని ఎన్జీటీ ఢిల్లీ ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్నసాగర్‌ సైతం ఇదే తరహాలో ఉందని, దానిపైనా విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ తేల్చిచెప్పింది. భూకంపాలకు సంబంధించిన అధ్యయనాలు లేకుండా మల్లన్నసాగర్‌ నిర్మించడంతో పాటు ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణను సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్‌తో పాటు ప్రజల ప్రాణాలనూ ప్రమాదంలో నెట్టేసిందంటూ కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది.


మల్లన్నసాగర్‌ నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఈ ప్రదేశంలో భూకంపాలపై జాతీయ భూభౌగోళిక అధ్యయన సంస్థతో అధ్యయనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016లో సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ సీఈ ఆమోదించారు. ఈ అధ్యయనాలు నిర్వహించాలంటూ నీటిపారుదల శాఖ 2016 డిసెంబరు, 2017 ఆగస్టు, అక్టోబరులో ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చేదాకా ఆగకుండానే 2017లో నీటిపారుదల శాఖ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు మల్లన్నసాగర్‌ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువునా 3 జతల పగళ్లు, వాటిలో కదలికలు ఉన్నట్లు ఎన్‌జీఆర్‌ఐ 2017 మార్చిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొందని కాగ్‌ స్పష్టం చేసింది. వీటి ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్‌ ఆక్షేపించింది. తాజాగా ఎన్జీటీ ఇవే అంశాలపై దృష్టి సారించనుంది.

Updated Date - Sep 06 , 2024 | 03:14 AM

Advertising
Advertising