ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NH-565,: నల్లగొండకు బైపాస్‌ రోడ్డు

ABN, Publish Date - Oct 15 , 2024 | 04:38 AM

నల్లగొండ పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఎన్‌హెచ్‌-565పై నకిరేకల్‌ నుంచి నాగార్జునసాగర్‌ దారిలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం కానుంది.

  • 8 ఎన్‌హెచ్‌ 565పై 14 కి.మీ.. 4 లేన్లతో నకిరేకల్‌-సాగర్‌ దారిలో నిర్మాణం

  • 8 ‘ఎక్స్‌’లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

  • 8 కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఎన్‌హెచ్‌-565పై నకిరేకల్‌ నుంచి నాగార్జునసాగర్‌ దారిలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం కానుంది. ఈ దారిలో 14 కిలోమీటర్ల మేర 4 లేన్లుగా బైపాస్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ బైపాస్‌ రోడ్డు కోసం రూ.516 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌-565 రహదారి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను కలిపే ముఖ్యమైన జాతీయ రహదారి అని, ఇది తెలంగాణలోని నకిరేకల్‌ వద్ద ఎన్‌హెచ్‌-65ని కలుస్తుందని తెలిపారు. ఈ రహదారి నల్లగొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి వంటి పట్టణాల నుంచి వెళుతుందని గడ్కరీ వివరించారు.


ఈ రోడ్డు నిర్మాణంతో నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్‌ తగ్గడమే కాకుండా, రహదారి భద్రత మెరుగుపడుతుందని, నకిరేకల్‌-నాగార్జునసాగర్‌ మధ్య మెరుగైన కనెక్టివిటీకి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కాగా, నల్లగొండకు బైపాస్‌ రోడ్డు మంజూరు చేయడం పట్ల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎందరో ప్రయాణికుల ప్రాణాలను హరిస్తున్న ట్రాఫిక్‌ నియంత్రణకు బైపాస్‌ రోడ్డు ఎంతో కీలకమైనదన్నారు. నల్లగొండ పట్టణానికి ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు బైపాస్‌ రోడ్డు మంజూరు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్‌కు కోమటిరెడ్డి రీట్వీట్‌ చేశారని మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Oct 15 , 2024 | 04:38 AM