ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ragging: వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ సీరియస్‌

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:05 AM

వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ రోగం వికృతరూపం దాల్చుతోంది. తెలంగాణలోనూ ఇటీవల నాలుగైదు కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులందినట్టు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది.

  • పలు కాలేజీల్లో భారీగా ఫిర్యాదులు.. కట్టడికి చర్యలు తీసుకోవాలి

  • రాష్ట్రాల వైద్య విద్య సంచాలకులు, ప్రిన్సిపాళ్లు, డీన్‌లకు ఎన్‌ఎంసీ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ రోగం వికృతరూపం దాల్చుతోంది. తెలంగాణలోనూ ఇటీవల నాలుగైదు కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులందినట్టు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది. గుజరాత్‌ రాష్ట్రం ధర్పూర్‌లోని గుజరాత్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సొసైటీ (జీఎంఈఆర్‌ఎస్‌) వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థి ఒకరు ఇటీవల ర్యాగింగ్‌ కారణంగా మరణించాడు.


ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళాశాలలో ర్యాగింగ్‌ వల్ల విద్యార్థి చనిపోవడాన్ని ఎన్‌ఎంసీ సీరియ్‌సగా తీసుకుంది.ఇటీవలికాలంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల నుంచి ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు వరుసగా ఫిర్యాదులు అందుతున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ ముప్పును అరికట్టడంపై తీసుకోవాల్సిన చర్యలపై తాజాగా అన్ని రాష్ట్రాల వైద్యవిద్య సంచాలకులు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్‌ లకు లేఖ రాసింది. కళాశాలల్లో సురక్షిత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఎన్‌ఎంసీ హెచ్చరించింది.

Updated Date - Dec 10 , 2024 | 05:05 AM