ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MSc Nursing: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి

ABN, Publish Date - Oct 01 , 2024 | 04:51 AM

ఎమ్మెస్సీ నర్సింగ్‌ సీట్లను ప్రవేశపరీక్ష ద్వారా కాకుండా కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తుండటంతో తాము నష్టపోతున్నామని ప్రభుత్వ నర్సింగ్‌ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • సర్కారుకు నర్సింగ్‌ ఆఫీసర్ల మొర

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెస్సీ నర్సింగ్‌ సీట్లను ప్రవేశపరీక్ష ద్వారా కాకుండా కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తుండటంతో తాము నష్టపోతున్నామని ప్రభుత్వ నర్సింగ్‌ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్‌ యూనివర్సిటీ ఎమ్మెస్సీ నర్సింగ్‌ అడ్మిషన్లను మెరిట్‌ ప్రతిపాదికన నిర్వహిస్తోంది. సోమాజిగూడలోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో 12 సీట్లను ఇన్‌సర్వీ్‌స కోటా కింద కేటాయించింది. ఇందులో ఒక ప్రైవేటు స్పాన్సర్డ్‌ సీటు ఉండగా.. 11 సీట్లే అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికిపైగా ప్రభుత్వ నర్సింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.


ఇందులో ఆరేడు వేల మంది బీఎస్సీ నర్సింగ్‌ వాళ్లు ఉంటారని సమాచారం. అందరికీ కలిపి 11 సీట్లే ఉండటంతో నష్టపోతున్నామని సీనియర్‌ నర్స్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీట్లకు అర్హత పరీక్ష నిర్వహించి అడ్మిషన్స్‌ చేపట్టాలని సర్కారును కోరుతున్నారు. ఈమేరకు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరుతూ హెల్త్‌ సెక్రటరీ, కాళోజీ హెల్త్‌వర్సిటీ వీసీ, డీఎంఈకి వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు.

Updated Date - Oct 01 , 2024 | 04:51 AM