ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medaram Jatara: మేడారం హుండీ లెక్కింపు.. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటోలు..

ABN, Publish Date - Feb 29 , 2024 | 02:59 PM

నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన సమ్మక్క - సారలమ్మ జాతర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన సమ్మక్క - సారలమ్మ జాతర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన కానుక‌ల హుండీలను అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 518 హుండీల‌ను ఏర్పాటు చేయగా వాటిని లెక్కించేందుకు హ‌నుమ‌కొండ‌లోని టీటీడీ క‌ళ్యాణ‌మండ‌పానికి తీసుకువస్తారు. లెక్కింపు కార్యక్రమం దాదాపు 10 రోజుల‌పాటు జ‌రగనుంది. డబ్బులు లెక్కిస్తున్న సమయంలో లభించిన కరెన్సీని అధికారులు అవాక్కయ్యారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్ ఫొటో ఉండంతో అందరూ ఆశ్చర్యపోయారు.

మొదట ఓపెన్ చేసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమయ్యాయి. అయితే బీఆర్.అంబేడ్కర్ ఫొటోతో ముద్రించిన న‌కిలీ వంద రూపాయల నోట్లు బయటపడ్డాయి. కాగా.. అంబేడ్కర్ బొమ్మను క‌రెన్సీ నోట్లపై ముద్రించాల‌న్న డిమాండ్లు వస్తున్న తరుణంలో ఈ విషయాన్ని జ‌నం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు.. 2020జాతర సమయంలో 11 కోట్ల 17 ల‌క్షల రూపాయ‌లు, 2022 కరోనా సమయంలో 10 కోట్ల 91 ల‌క్షల రూపాయ‌లు వచ్చాయి.


హన్మకొండ టీటీడీ కళ్యాణమండపంలో హుండీల కౌంటింగ్ ప్రక్రియ పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో దేవాదాయశాఖ అధికారులు, మేడారం పూజారుల సమక్షంలో హుండీలు లెక్కిస్తున్నారు. లెక్కింపు మొదటిరోజే ఇలాంటి ఘటనలు జరగడంతో సిబ్బంది షాక్ అయ్యారు. ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 02:59 PM

Advertising
Advertising