ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Investigation: కొకైన్‌ చుట్టూనే..

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:46 AM

కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌ్‌సలో జరిగిన పార్టీపై విచారణ కొనసాగుతోంది. రాజ్‌ సన్నిహితుడు విజయ్‌కి డ్రగ్‌ పరీక్షలో కొకైన్‌ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.

  • పార్టీలోకి ఆ డ్రగ్‌ ఎలా వచ్చింది?

  • విజయ్‌కు ఎవరు సరఫరా చేశారు?

  • కొనసాగుతున్న పోలీసుల విచారణ

  • రాజ్‌ పాకాలకు నోటీసులు జారీ

  • 48 గంటల్లో వస్తానంటూ లేఖ

  • విచారణకు రాని విజయ్‌ మద్దూరి

  • ఫాంహౌస్‌ పార్టీకి హాజరైన అందరికీ త్వరలో నోటీసులు

శంకర్‌పల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌ్‌సలో జరిగిన పార్టీపై విచారణ కొనసాగుతోంది. రాజ్‌ సన్నిహితుడు విజయ్‌కి డ్రగ్‌ పరీక్షలో కొకైన్‌ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. కొకైన్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? విజయ్‌కి ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే పార్టీ సమయంలో కాయిన్స్‌ రూపంలో పేక ఆడినట్లు తేలితే గేమింగ్‌ చట్టం కింద మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. విచారణకు గైర్హాజరవుతున్న రాజ్‌ పాకాలకు పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. రాయదుర్గంలోని ఓరియన్‌ విల్లాల్లో ఉన్న ఆయన ఇంటికి మోకిల పోలీసులు వెళ్లగా తాళం వేసి ఉండడంతో ఇంటికి నోటీసులు అంటించారు.


శనివారం రాత్రి జన్వాడలోని రాజ్‌ పాకాల ఫాంహౌ్‌సలో జరిగిన ఘటన వివరాలను తెలియజేసేందుకు సోమవారం రాత్రి 11 గంటల్లోపు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటి అడ్ర్‌సతో కూడిన గుర్తింపు కార్డు తీసుకుని రావాలని సూచించారు. రాజ్‌ పాకాలను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. అదే విధంగా 48 గంటల్లో విచారణకు హాజరవుతానంటూ ఇద్దరు లాయర్లతో పోలీస్‌ స్టేషన్‌కు లెటర్‌ పంపారు. ఇదిలా ఉంటే డ్రగ్‌ తీసుకొని రాజ్‌ పాకాల ఫాంహౌ్‌సలో పట్టుబడిన విజయ్‌ మద్దూరికి 41 సీఆర్‌పీఎస్‌ నోటీసులు అందజేసి ఆదివారం రాత్రి స్టేషన్‌ బెయిల్‌పై పోలీసులు వదిలేశారు.


సోమవారం హాజరు కావాలని సూచించగా సాయంత్రం వరకు ఆయన రాలేదు. అయితే పోలీసులు రైడ్‌ చేసిన సమయంలో విజయ్‌ తన మొబైల్‌ను దాచి పక్కనే ఉన్న మహిళ మొబైల్‌ ఫోన్‌ను పోలీసులకు అందజేసినట్లు సమాచారం. తన మొబైల్‌ దొరికితే డ్రగ్స్‌ లింక్‌ బయటపడతాయనే ఇలా చేసినట్లు తెలిసింది. సీజ్‌ చేసిన ఫోన్‌ను ఇవ్వాలని ఆ మహిళ స్టేషన్‌కు రాగా కోర్టు నుంచి తీసుకోవాలని చెప్పి పంపారు. రాజ్‌ పాకాలతో పాటు విజయ్‌ నోరు విప్పితేనే కేసు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


  • 7.35 ఎకరాల్లో..

రాజ్‌ పాకాల ఫాంహౌస్‌ సుమారుగా 7.35 ఎకరాల్లో ఉంది. 691 సర్వే నంబరులో దాదాపు 1500 గజాల విస్తీర్ణంలో శ్రీమాతే ప్రాపర్టీస్‌ పేరుతో ఇల్లు (జీ+1) నిర్మించారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉంది. అయితే కొన్నాళ్ల కిందటే నిర్మాణాన్ని పూర్తి చేసి, ఇంటి నంబరు కూడా తీసుకున్నట్లు సమాచారం. తన బావమరిది రాజ్‌ పాకాల జన్వాడలో కొత్తగా ఇల్లు కట్టుకొని, దావత్‌ చేశాడని, దానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారని కేటీఆర్‌ చెబుతున్నప్పటికీ అక్కడ నిర్మించింది ఫాంహౌసేనని స్పష్టమవుతోంది. శంకర్‌పల్లి-గండిపేట ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఈ ఫాంహౌస్‌ ఉంటుంది. అక్కడ మరికొందరి ఫాంహౌ్‌సలు కూడా ఉన్నాయి.


  • పార్టీలో పాల్గొన్న వారికి త్వరలో నోటీసులు..!

ఫాంహౌస్‌ పార్టీలో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. అయితే ఆదివారం ముగ్గురు వ్యక్తులకు నోటీసులివ్వగా వారితో పాటు మరో ముగ్గురు స్వచ్ఛందంగా వచ్చారు. వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుని పంపించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీలో పాల్గొన్న మిగతా వారందరికీ నోటీసులిచ్చి, స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు.

Updated Date - Oct 29 , 2024 | 03:46 AM