ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

N Convention: ‘ఎన్‌’.. ఎందుకంత ప్రత్యేకం?

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:03 AM

పార్టీలు, పెళ్లిళ్లు, ఫ్యాషన్‌ షోలు, బోర్డు మీటింగ్‌లు, ఎగ్జిబిషన్‌లు..! హైదరాబాద్‌లో కాస్త ఉన్నత స్థాయి వేడుక ఏదైనా వేదికగా మొదట ‘ఎన్‌’ కన్వెన్షన్‌కే ప్రాధాన్యం.

N Convention

  • హైదరాబాద్‌లో దీనిది ప్రముఖ స్థానం

  • పెళ్లిళ్ల నుంచి ఫ్యాషన్‌ షోల వరకు ఇక్కడే

  • హాలులో 3 వేలమంది కూర్చునే అవకాశం

  • అద్దె రూ.5 లక్షల నుంచి ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): పార్టీలు, పెళ్లిళ్లు, ఫ్యాషన్‌ షోలు, బోర్డు మీటింగ్‌లు, ఎగ్జిబిషన్‌లు..! హైదరాబాద్‌లో కాస్త ఉన్నత స్థాయి వేడుక ఏదైనా వేదికగా మొదట ‘ఎన్‌’ కన్వెన్షన్‌కే ప్రాధాన్యం. నటుడు అక్కినేని నాగార్జున తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి నల్లా ప్రీతమ్‌రెడ్డితో కలిసి 14 ఏళ్ల కిందట ఎన్‌3 ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట దీనిని నిర్మించారు. ‘సందర్భం ఏదైనా వేదిక మాది..’ అనే ట్యాగ్‌లైన్‌తో మరెక్కడా జరగనన్ని వేడుకలకు ఇది వేదిక అయింది. ఇప్పుడు హైడ్రా దెబ్బకు కాలగర్భంలో కలిసింది.

N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కీలక ప్రకటన


ఎన్‌లో నాలుగు హాళ్లు ఉండగా.. 27 వేల చ.అ. విస్తీర్ణంలో 3 వేలమంది కూర్చునే ప్రధాన హాల్‌లో ఖరీదైన వివాహాలు, రిసెప్షన్లతో పాటు ఫ్యాషన్‌ షోలు, సినిమా వేడుకలు జరిగేవి. దీనిని ఆనుకుని 37 వేల చ.అ. విస్తీర్ణంలోని భారీ గార్డెన్‌లో పెళ్లిళ్లు లేదంటే భారీ ఫంక్షన్స్‌, అంతర్జాతీయ సంస్థల ప్రమోషన్స్‌ నిర్వహించేవారు. 5 వేల చ.అ.లలోని డైమండ్‌ హాల్‌లో 500 మందితో చిన్న వేడుకలు, కంపెనీల ఉత్పత్తుల ఆవిష్కరణలు జరిగేవి. దీని బయట మర్రి చెట్టు చెంత బనియాన్‌ అంటూ ఓపెన్‌ ఎయిర్‌ వెన్యూ 26 వేల చ.అ.లలో ఉంది. ఈ రెండింటి అవసరాలను తీర్చుతూ ఏడు వేల చ.అ.లలో అనెక్స్‌ హాల్‌ను నిర్మించారు.


  • శ్రావణ మాసంలో పెళ్లిళ్లు ఎలా?

ఓపక్క సైబరాబాద్‌, మరోపక్క గుట్టల నడుమ తమ్మిడికుంట చెరువుతో పాటు నగరం మధ్యలో ఉండడం, రవాణా సదుపాయాల కారణంగా అద్దె ఎక్కువ (రూ.5 లక్షలతో ప్రారంభం) అయినా సరే ఎన్‌ కన్వెక్షన్‌ను ఎంచుకునేవారు. ఇక్కడ జరిగిన ఉన్నత వర్గాల వారి వివాహాలు, వేడుకల జాబితా చాలానే ఉంది. ఎన్‌లో కార్యక్రమ నిర్వహణను హోదాగానూ భావించేవారు. ఖాళీ లేకపోతే వాయిదా వేసుకున్నవారూ ఉన్నారు. ఓ ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ తమ షోలన్నీ ఇక్కడే జరిపేది.


కొన్ని కంపెనీలు వార్షిక వేడుకలు, ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌లు ఏర్పాటు చేసేవి. ఇక కొత్త సంవత్సర వేడుకల వేళ 4వేదికలలో వేర్వేరు పార్టీలతో ఎన్‌ కన్వెన్షన్‌కు ప్రత్యేక గుర్తింపే ఉంది. కాగా, శ్రావణ మాసం కావడంతో దీనిని ఈ నెల 28న, ఆ తర్వాత మరో పెళ్లి, ఇతర పార్టీలకు బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. కూల్చివేతతో గందరగోళం నెలకొంది. ఇంత తక్కువ సమయంలో మరో చోటు వెదుక్కోవడం ఎలాగని సంబంధిత వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 07:57 PM

Advertising
Advertising
<