ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Palamuru-Rangareddy: వట్టెం పంపుహౌస్‌లో నీళ్లు తోడడం కష్టమే!

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:36 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌ్‌సలోకి 30లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర నీరు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీళ్లు ఉన్నట్లు అంచనా

  • నెల నుంచి 2 నెలల దాకా సమయం పట్టే అవకాశం

  • త్వరగా పునరుద్ధరించాలని మంత్రి జూపల్లి ఆదేశం

నాగర్‌కర్నూల్‌/కందనూలు/హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌ్‌సలోకి 30లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర నీరు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని తోడేందుకు నెల నుంచి రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదుల, వట్టెం పంప్‌హౌ్‌సలను నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌, ఎత్తిపోతల సలహాదారుడు పెంటారెడ్డి తదితరులు పరిశీలించారు. వట్టెం పంపుహౌ్‌సలో రెండు మోటార్లతో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ బుధవారం ప్రారంభించగా.. మరో 16 మోటార్లు అదనంగా పెట్టాలని అధికారులను వారు ఆదేశించారు. వట్టెం పంప్‌హౌ్‌సలో 9మోటార్లు పెట్టాలని నిర్ణయించగా... ఇప్పటివరకు 5 మోటార్లను బిగించారు.


మిగతా మోటార్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతున్న దశలోనే వరద నీటితో నిండిపోయింది. మరో నెలన్నర పాటు మోటార్లు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మున్ముందు సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేఎల్‌ఐ ఎత్తిపోతల పథకంలోని పంపుహౌ్‌సకు సంబంధించి 3, 5వ మోటార్లను ఇప్పటికీ పునరుద్ధరించ లేకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. అయితే, వట్టెం పంపుహౌస్‌ డీ వాటరింగ్‌ ప్రక్రిను నెల రోజుల్లోనే పూర్తి చేసి.. ఆ తర్వాత మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో నార్లాపూర్‌ నుంచి ఏదులవరకు ప్రధాన కాల్వకు సంబంధించి 15లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మిగిలి ఉండగానే ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రాజెక్టును ప్రారంభించడం వల్లే ఈ తతంగమంతా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, కీలకమైన ప్యానల్‌ బోర్డులు, స్టార్టర్లు, ఎలక్ట్రికల్‌ ఎక్వి్‌పమెంట్‌ను సురక్షిత ప్రదేశంలో ఉంచడంతో పంప్‌హౌ్‌సకు భారీనష్టం తప్పిందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. వట్టెంపంపుహౌ్‌సను త్వరగా పునరుద్ధరించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. నీట మునిగిన పంపుహౌస్‌ను అధికారులతో కలిసి మంత్రి బుధవారం పరిశీలించారు. పంపులు నీట మునగడానికి గల కారణాలు, వాటి సామర్థ్యం, సర్వీస్‌,నిర్వహణ విషయాలపై ఆరా తీశారు.

Updated Date - Sep 05 , 2024 | 04:36 AM

Advertising
Advertising