Juloori Gouri Shankar: తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చొద్దు!
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:42 AM
ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైకోర్టులో శనివారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ప్రజల మనోభావాల్ని దెబ్బతీయొద్దు
హైకోర్టులో జూలూరు గౌరీశంకర్ పిల్
విచారించనున్న సీజే ధర్మాసనం
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైకోర్టులో శనివారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుత తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించడంతోపాటు గర్వకారణంగా భావిస్తుంటారని తెలిపారు. ప్రభుత్వం విగ్రహం మార్పు ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా పాతవాటి స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వ ఖజానా మీద భారీ ఒత్తిడి పడుతుందని జూలూరు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాల ఏర్పాటుకు రూ.150 కోట్ల వరకు వ్యయం అవుతుందని.. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సబబు కాదని తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పుట్టినరోజైన డిసెంబరు 9న.. ఆమె జన్మదినోత్సవం బహుమతిగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని దీని వెనుక రాజకీయ కుట్రతోపాటు గత ప్రభుత్వం ఆధ్యర్యంలో చేపట్టిన కార్యక్రమాల ఆనవాళ్లను చెరిపివేయాలన్న దురుద్దేశం ఉందన్నారు. ఈ పిటిషన్ త్వరలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నది.
కోర్టు ఉత్తర్వులు దాచి పెట్టి మోసం చేసినందుకు రూ.5 లక్షల జరిమానా!
ఇప్పటికే అమలులో ఉన్న కోర్టు ఉత్తర్వులను దాచి పెట్టి మోసం చేయడం ద్వారా భూమిని తమ పేరిట చేయించుకున్న ఇండస్ట్రియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగువారాల్లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి జమ చేయాలని పేర్కొంది. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Dec 08 , 2024 | 04:42 AM