Sarpanches Protest: సచివాలయ ముట్టడి చేపట్టిన సర్పంచ్‌లను అడ్డుకున్న పోలీసులు..
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:08 AM
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించిన సర్పంచులను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
పలువురి అరెస్టు.. పీఎస్‌లకు తరలింపు
అరెస్టు హేయమైన చర్య : హరీశ్
అఫ్జల్‌గంజ్, తిరుమలగిరి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించిన సర్పంచులను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేశారు. ఆ తరువాతే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నర్సింహా రెడ్డి, సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లుల విడుదలకు డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి వెళుతున్న సర్పంచులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పోలీసులు అరెస్టు చేసి బొల్లారం తిరుమలగిరి పోలీ్‌సస్టేషన్‌కు తరలించిన సర్పంచులను హరీశ్ రావు ఎమ్మెల్యేల బృందంతో వచ్చి పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని, సర్పంచులు ధైర్యం కోల్పోకుండా ఉండాలని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రణాళిక ఉపసంఘం గ్రామ పంచాయతీ బకాయిలను వెంటనే చెల్లించాలని హరీశ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.1500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. అరెస్టయిన సర్పంచులను పరామర్శించడానికి హరీశ్‌తో పాటు మాజీమంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సంజయ్, బండారి లక్ష్మా రెడ్డి, దేశ్‌పత్రి శ్రీనివాస్ వెళ్లారు. తమ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం తగదని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మినర్సింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - Aug 03 , 2024 | 03:08 AM