ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Police Commissioner: బోనాల పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి..

ABN, Publish Date - Jul 06 , 2024 | 08:57 AM

గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి(Police Commissioner Srinivas Reddy) సూచించారు. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొట్టెల ఊరేగింపు ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు కోటలో బందోబస్తును పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్నారు.

- సిటీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‏రెడ్డి

హైదరాబాద్: గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి(Police Commissioner Srinivas Reddy) సూచించారు. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొట్టెల ఊరేగింపు ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు కోటలో బందోబస్తును పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస్‏రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సుల నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన సిబ్బందికి తెలిపారు. ప్రత్యేక బందోబస్తులో భాగంగా గోల్కొండ కోటలో ఉన్న కెమెరాలతో పాటు కొన్ని ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళా భక్తులకు రక్షణగా షీ టీమ్‌లు పనిచేస్తాయన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి వెంట అడిషనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, సౌత్‌వెస్ట్ జోన్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, పలు శాఖల అధికారులు ఉన్నారు.


కలెక్టర్‌తో కలిసి..

నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివార్ రెడ్డితో పాటు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌(Hyderabad District Collector Anudeep) పనులను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతిని, బారీకేడ్లను, షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అనుదీప్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 08:57 AM

Advertising
Advertising