ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..

ABN, Publish Date - Jun 17 , 2024 | 09:22 AM

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికన్ నుంచి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికన్ నుంచి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో సోదాలు నిర్వహించారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు 5 మాక్ మినీ డివైజ్‌లు సీజ్ చేశారు. సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించారు.


ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించారు. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్‌వేర్ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో స్వాధీనం చేసుకున్న పరికరాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 09:22 AM

Advertising
Advertising