ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: కూలిన టెంట్లు.. సిబ్బంది పరుగులు!

ABN, Publish Date - May 13 , 2024 | 04:22 AM

ఎన్నికల వేళ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పోలింగ్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఈదురుగాలులకు టెంట్లు నేలకూలడంతో పరుగులు పెట్టారు. కొన్ని చోట్ల వర్షంలో తడుస్తూనే పోలింగ్‌ కేంద్రాలకు తరలిపోయారు. పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లోకి భారీగా వరద నీరు చేరింది.

వర్షాలతో పోలింగ్‌ సిబ్బందికి ఇబ్బంది

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎన్నికల వేళ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పోలింగ్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఈదురుగాలులకు టెంట్లు నేలకూలడంతో పరుగులు పెట్టారు. కొన్ని చోట్ల వర్షంలో తడుస్తూనే పోలింగ్‌ కేంద్రాలకు తరలిపోయారు. పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పీటీజీ బాలుర పాఠశాల ఆవరణలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఈదురుగాలులు, వానతో టెంట్లు కూలడంతో సిబ్బంది పక్కనే ఉన్న గది వరండాలో తలదాచుకున్నారు.


నారాయణఖేడ్‌లోని మోడల్‌ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్‌ పట్టణంలోని జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 4 పోలింగ్‌ బూత్‌ల ఆవరణలోకి భారీగా వరద నీరు చేరి చెరువును తలపించింది. అదే జిల్లాలోని చాలా పోలింగ్‌ కేంద్రాల్లో వర్షాలకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోనూ వర్షంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని గోవిందాపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం ఆవరణలోకి నీరు చేరటంతో ఎన్నికల సిబ్బంది అవస్థలు పడ్డారు.

Updated Date - May 13 , 2024 | 04:22 AM

Advertising
Advertising