ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dharani Portal: ఓ పెద్దమనిషి, ఉన్నతాధికారి కుట్ర ఫలితమే ధరణి

ABN, Publish Date - Aug 20 , 2024 | 04:07 AM

గత ప్రభుత్వ హయాంలో ఓ పెద్దమనిషి, ఓ ఉన్నతాధికారి కలిసి కుట్ర పూరితంగా రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు.

  • రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

  • ధరణి సమస్యలకు త్వరలో చరమగీతం: పొంగులేటి

హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో ఓ పెద్దమనిషి, ఓ ఉన్నతాధికారి కలిసి కుట్ర పూరితంగా రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. చట్టాలు సరిగా లేకుంటే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టమే నిదర్శనమని విమర్శించారు. ధరణి పేరుతో రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. త్వరలోనేతాము తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని తెలిపారు.


టూరిజం ప్లాజాలో సోమవారం ట్రెసా ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి సమస్యలకు త్వరలో చరమగీతం పాడతామన్నారు. రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. భూ చట్టాల నిపుణుడు సునీల్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన నష్టాలతోపాటు కొత్త చట్టం ద్వారా అందనున్న సేవలను వివరించారు.


ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ కొత్త ముసాయిదాపై తమ వంతుగా అన్ని మండలాల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్‌ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘ఆస్కి’ డీజీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కి) డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డా.నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సోమవారం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Aug 20 , 2024 | 04:08 AM

Advertising
Advertising
<