ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: ఎన్టీఆర్‌ను విమర్శిస్తే పురందేశ్వరి ఊర్కుంటారా?

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:09 AM

పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఊర్కుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

  • అమిత్‌ షా.. అంబేడ్కర్‌ను విమర్శిస్తే పట్టదా?: పొన్నం

వేములవాడ టౌన్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఊర్కుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కెట్‌ కమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ పార్లమెంట్‌ వేదికగా అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి విమర్శించినా పురందేశ్వరి ఏమీ జరగనట్లు మాట్లాడుతున్నారన్నారు. రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య మా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో కక్షసాధింపు ఉండదని, అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సినిమా థియేటర్‌లో జరిగిన సంఘటనను వివరించారని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అలా స్పందించడం సరికాదని ఆయన అన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 04:09 AM