మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

ABN, Publish Date - Mar 24 , 2024 | 09:22 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
Phone Tapping Case

హైదరాబాద్, మార్చి 24: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ టాపింగు పాల్పడ్డానని ప్రణీత్ రావు అంగీకరించాడు. పలు సందర్భాల్లో భుజంగరావు, తిరుపతన్నలిచ్చిన నెంబర్లను టాప్ చేశాననని వెల్లడించాడు ప్రణీత్ రావు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లను టాప్ చేశామని చెప్పాడు.

రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామమని విచారణలో ప్రణీత్ రావు వెల్లడించాడు. పలువురు రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా టాప్ చేశామమని చెప్పాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించాడు. ఎన్నికల ఫలితాలు రోజు ప్రభాకర్ రావు చెప్పిన తీరుగా వ్యవహరించానని ప్రణీత్ రావు పోలీసు విచారణలో తెలిపాడు. ట్యాపింగ్‌కు సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశానని ప్రణీత్ రావు చెప్పాడు.

ఇదికూడా చదవండి: అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు..

17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నింటినీ ధ్వంసం చేశానని, హార్డ్ డిస్క్‌లు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశామన్నాడు. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లను తీసుకువెళ్లి మూసీ నదిలో పడేశామని ప్రణీత్ రావు చెప్పాడు. రెండు లాగర్ రూమ్‌లలో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ తగులబెట్టినట్లు ప్రణీత్ రావు తెలిపాడు.

భుజంగరావు వెల్లడించిన సంచలన నిజాలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు సంచలన నిజాలు వెల్లడించారు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపాడు. బీఆర్ఎస్ నేత ఇచ్చే నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు పంపించామన్నాడు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను, వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగరావు వెల్లడించాడు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకి ఇచ్చానని మరో పోలీసు అధికారి తిరుపతన్న తెలిపాడు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశామన్నారు. డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 09:27 PM

Advertising
Advertising