Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు
ABN, Publish Date - Oct 20 , 2024 | 04:42 PM
రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.
హైదరాబాద్: పదేళ్ల అధికారానికి దూరమై, లోక్ సభ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితమై, పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకోలేక, పార్టీలో గ్రూపు రాజకీయాలను అదుపు చేయలేక సతమతమవుతోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలయ్యాక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బాత్‌రూంలో జారి పడటం, ఆయన తుంటి ఎముక విరిగి 3 నెలలకుపైగా విశ్రాంతి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 10 మంది అధికార కాంగ్రెస్‌లోకి జంప్ కావడంతో శ్రేణులు మరింతగా డీలా పడ్డారు. సంవత్సర కాలంగా బీఆర్ఎస్ రాజకీయంగా, న్యాయపరంగా అనేక సమస్యలను ఎదుర్కుంటోంది.
జీవితంలో కష్ట సుఖాలు రావడం సాధారణమే. అయితే ఇన్నాళ్లు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు. కేసీఆర్‌కు ప్రస్తుతం రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్‌కు రాజయోగం కలగనుందని విశ్లేషించారు. ఈ మేరకు ఆయన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే జోతిష్యాలు ప్రాచుర్యం పొందాయి. ప్రశాంత్‌కు.. ఎక్స్‌లో 52 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నదనే విషయాలను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీన్ని లక్ష మందికిపైగా చూశారు.
పోస్ట్‌లో ఏముందంటే..
"రాహు అంతరదశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. ఆయన జాతకం ప్రకారం.. రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. 2024 సెప్టెంబర్ నుంచి గురు దశ ప్రారంభమైంది. అక్టోబర్ 2026లో రాజకీయంగా ఫెయిల్ అవుతారు. అయితే 2027 జనవరిలో ఆయన రాజకీయ భవిష్యత్ అనూహ్య మలుపులు తిరుగుతుంది. 2027 జనవరి నుంచి 2029 మే వరకు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ తన మార్క్‌ను ప్రదర్శిస్తారు. 2029లో అత్యంత శుభయోగం ఆయనకు పట్టబోతోంది. మరోసారి సీఎంగా కంబ్యాక్ ఇస్తారు ' అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
గతంలో..
ప్రశాంత్ కిని డిసెంబరు 14, 2023లో ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రధాని హసినా పదవీచ్యుతురాలు అవుతారని అందులో పేర్కొన్నారు. ఆమెను హత్య చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. ‘షేక్ హసీనా 2024 మే నుంచి ఆగస్టు వరకూ అప్రమత్తంగా ఉండాలి. దేశంలో జులై, ఆగస్టులో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఆమెపై హత్యాయత్నం కూడా జరగవచ్చు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన అంచనాలకు తగినట్లే ఆగస్టు నెలలో బంగ్లాలో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుని.. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్‌ను ఆశ్రయించారు. ఇదే కాకుండా ఈ ఏడాది వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను ప్రశాంత్ కిని ముందే అంచనా వేశారు.
‘జులై మొదటి వారంలో రికార్డుస్థాయిలో కురిసే అత్యంత భారీ వర్షాలకు దేశ పశ్చిమ తీరంలోని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దక్షిణాదిలోని పలు కొండ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడతాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని ఆయన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన చెప్పిన విధంగానే వయనాడ్‌లో ప్రకృతి విరుచుకుపడింది. వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా కేసీఆర్ రాజకీయ ప్రయాణంపై కూడా ప్రశాంత్ పాజిటీవ్‌గా జోస్యం చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నాయి. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..
Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..
HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
For Telangana News And Telugu News...
Updated Date - Oct 20 , 2024 | 05:51 PM