TG: సిద్దిపేట జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు
ABN, Publish Date - May 24 , 2024 | 05:23 AM
సిద్దిపేట జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ధూళిమిట్ట మండలం బెక్కల్‌లోని బెక్కల్ గుట్టకు పడమటి దిక్కున బృహద్ శిలాయుగం నాటి ఆదిమానవుల ఆవాస ప్రాంతం, ఇనుప రాతి నుంచి ఇనుమును సంగ్రహించే పరిశ్రమను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గురువారం గుర్తించారు.
బెక్కల్ గుట్టపై గుర్తించిన చరిత్ర పరిశోధకులు
ధూళిమిట్ట, మే 23 : సిద్దిపేట జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ధూళిమిట్ట మండలం బెక్కల్‌లోని బెక్కల్ గుట్టకు పడమటి దిక్కున బృహద్ శిలాయుగం నాటి ఆదిమానవుల ఆవాస ప్రాంతం, ఇనుప రాతి నుంచి ఇనుమును సంగ్రహించే పరిశ్రమను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గురువారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం వ్రెక్కంటి, బెక్కంటిగా పిలుచుకున్న బెక్కల్ గ్రామశివారులో సులభంగా అధిరోహించగల ఏకశిలతో కూడిన గుట్టకు సమీపంలో జెనిగల వాగు, సారవంతమైన మట్టి నేలలు ఉండడంతో ఆదిమానవులు ఆవాసాలు ఏర్పరుచుకున్నారని చెప్పారు.
అంతేకాక, పెద్దపెద్ద రాతి నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గుట్టకు దిగువన పాటి గడ్డపై వ్యవసాయం చేసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. గుట్టకు ఉత్తరాన అత్యంత పొడవైన జారుడు బండ, ఎనిమిది నాగ దేవతల విగ్రహాలను గుర్తించినట్లు తెలిపారు. పురావస్తు, దేవాదాయ శాఖల అధికారులు బెక్కల్ గుట్టను సందర్శించి ఇక్కడి శాసనాలను, శిల్పాలను పరిశీలించి గుట్టపై కొన్ని మార్పులు చేయాలని రత్నాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
Updated Date - May 24 , 2024 | 05:23 AM