Jayashankar University: జయశంకర్ వర్సిటీకి 37వ ర్యాంకు
ABN, Publish Date - Aug 15 , 2024 | 03:34 AM
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.
రాజేంద్రనగర్, హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా 145 వ్యవసాయ, అనుబంద పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో టాప్ 40 సంస్థలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో జయశంకర్ వర్సిటీ 37వ ర్యాంకు సాధించిందని అధికారులు తెలిపారు.
గతేడాది ఎన్‌ఐఆర్‌ఎప్ ప్రకటించిన టాప్-40 విద్యాసంస్థల్లో వర్సిటీకి చోటు దక్కలేదని, బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు మెరుగుపరచడంతో ఈ ఏడాది జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయం పరిధిలో అదిలాబాద్, తోర్నాలలో 60 మంది విద్యార్థులతో రెండు కొత్త వ్యవసాయ కళాశాలలను ప్రారంభించారు. నారాయణపేట్‌లో నూతన పాలిటెక్నిక్‌ను ప్రారంభించారు. వివిధ డిగ్రీ కోర్సులలో సీట్లను 1,370కు పెంచారు.
Updated Date - Aug 15 , 2024 | 03:34 AM