ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: పాజెక్టుల సలహాదారు రంగారెడ్డి కన్నుమూత

ABN, Publish Date - May 28 , 2024 | 06:12 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి (73) సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం సాయంత్రం తీవ్రమైన గుండెనొప్పి వచ్చి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

హైదరాబాద్‌/ నాగర్‌కర్నూల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి (73) సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం సాయంత్రం తీవ్రమైన గుండెనొప్పి వచ్చి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ఆయనే డిజైన్‌ చేశారు. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సలహాదారుగా వ్యవహరించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేశారు. పదిరోజుల క్రితం ప్రభుత్వం ఆయనను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సలహాదారుగా నియమించింది. ఆ బాధ్యతలు స్వీకరించాకుండానే ఆయన కన్నుమూశారు. రంగారెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా గన్యాగుల గ్రామం. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీమంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - May 28 , 2024 | 06:12 AM

Advertising
Advertising