ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Exam Cancellation: సీడీపీవో పరీక్ష రద్దుపై అభ్యర్థుల ఆందోళన..

ABN, Publish Date - Jul 21 , 2024 | 03:50 AM

మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను టీజీపీఎస్సీ రద్దు చేయడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను టీజీపీఎస్సీ రద్దు చేయడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా టీజీపీఎస్సీ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీడీపీవో పరీక్ష రాసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మూడు వారాల్లో నియామక పత్రాలు ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తే టీజీపీఎస్సీ అమలు చేయలేదని, దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేసినట్లు అభ్యర్థులు తెలిపారు. ఈ కేసు విచారణ దశలో ఉండగానే సీడీపీవో పరీక్షను రద్దు చేస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష లీకేజీకి కారణమైన వారెవరో వెల్లడించకుండా పరీక్ష రద్దు చేయడం సరైనది కాదని, కోర్టు ఆదేశాల మేరకే టీజీపీఎస్సీ తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

Updated Date - Jul 21 , 2024 | 03:50 AM

Advertising
Advertising
<