హెరిటేజ్‌ని సమ్మోహన పరచిన పురాణపండ శ్రీనివాస్ ‘శంకర .. శంకర’, ‘స్మరామి స్మరామి’
ABN, Publish Date - May 11 , 2024 | 12:35 AM
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
*హెరిటేజ్‌ని సమ్మోహన పరచిన ‘శంకర .. శంకర’, ‘స్మరామి ... స్మరామి’
*కొర్రపాటి సాయి, పురాణపండ శ్రీనివాస్‌కు ప్రశంసలు
హైదరాబాద్, మే 10: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హిందూపురం శాసనసభ్యులు, నందమూరి బాలకృష్ణలతో చాలా చక్కని, బలమైన అనుబంధం వున్న వ్యక్తి , ప్రముఖ సినీ నిర్మాత, వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి ఇటీవల సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటక బళ్లారి నగరంలో అతి అరుదైన అపురూపపు కృష్ణ శిలతో నిర్మించిన ‘శ్రీ అమృతేశ్వర దేవస్థానం’ పవిత్రంగా సంచలనం సృష్టించి అటు కర్ణాటక రాజకీయ, సినీ వర్గాలలో ఇటు సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారింది.
ఇక ప్రధానాంశంలోకి వస్తే సాయి కొర్రపాటికి అటు నారా, నందమూరి కుటుంబాలతో పాటు బలమైన బంధం వున్న కుటుంబం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబం అనేది తెలుగు చలన చిత్రపరిశ్రమంతటికీ తెలిసిన విశేషమే. మరొక ప్రత్యేక విశేషమేమిటంటే... ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటికి అత్యంత స్నేహపూర్వక సన్నిహితుడు కావడం వల్లనే శ్రీనివాస్ పరిచయం తర్వాత సాయి కొర్రపాటి జీవన వైభవంలో ఒక మహాద్భుత మైన మహా స్ఫటికలింగంతో శ్రీ అమృతేశ్వర ఆలయం నిర్మించడానికి చక్కని హేతువైందని మీడియా కూడా కోడై కూసింది. ఇది సత్యమని ఫిలిం వర్గాలు సైతం గొంతెత్తాయి.
ఇక పోతే ప్రతీ ఏటా వారాహి చలన చిత్రం సంస్థ సమర్పణలో సాయి కొర్రపాటి దంపతులు పురాణపండ శ్రీనివాస్ చేత ఒక అద్భుతమైన గ్రంధానికి రచనా శ్రీకారం చుట్టించి, చాలా సౌందర్యంగా ప్రచురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు మాత్రమే కాకుండా జంట నగరాల్లో వందలాది ఆలయాలకు కూడా వారాహి చలన చిత్రం కార్యాలయ సిబ్బంది చేత పంపించడం ఒక పవిత్రమైన ఆనవాయితీగా మారడంతో చాలామంది సినీ ప్రముఖులవద్ద వారాహి గ్రంధాలు ఇంటి పూజా మందిరాల్లోకి చేరాయనేది సత్యం.
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
‘శంకర .. శంకర’, ‘స్మరామి ... స్మరామి’ పేరిట పూర్తి మల్టీ కలర్‌లో అత్యంత మేలిమి ముద్రణలుగా.. ఎంతో విశేషంగా సమ్మోహన పరుస్తున్న ఈ రెండు గ్రంధాలను హెరిటేజ్ ఫుడ్స్ విశాల కార్యాలయంలో సిబ్బందికి కూడా ఇటీవల అందజేయడంతో... ఇలాంటి గాఢ భక్తి రసాత్మక గ్రంధాలను అందుకున్న హెరిటేజ్ కార్యాలయ ఉన్నతోద్యోగులు ఎంతెంతో సంతోషం ప్రకటించడం సాయి కొర్రపాటికి, పురాణపండ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు ప్రకటించడం దైవబలంగానే భావించాలి.
ఈ ‘శంకర .. శంకర’ , ‘స్మరామి ... స్మరామి’ రెండు గ్రంధాలను పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దిన విధానం పరమ రమణీయమైతే, ఈ బుక్స్ వెనుక అట్టపై నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి.. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల చక్కని చిత్రాలను ముద్రించి సాయి కొర్రపాటి , ఆయన సతీమణి రజనీ కొర్రపాటి తమ సంస్థల పక్షాన ఈ మంగళకరమైన గ్రంధాలతో స్వాగతం పలకడం తెలుగు దేశం వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రతీ పేజీను చాలా ఆసక్తితో, శ్రద్ధతో, భక్తి తో, ప్రతిభతో పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా ఈ మంత్ర పుష్పాలను పరిమళింపచేసినట్లు బుక్స్ చేతుల్లోకి తీసుకుని పేజీలు తిప్పుతుంటే స్పష్టంగా అర్థమై శ్రీనివాస్ కృషికి శభాష్ అనకుండా ఉండలేరు.
ఏదేమైనా ఈ బుక్స్ కోసం తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో ప్రయత్నించిన కొందరు తెలుగు దేశం నాయకులకు సాయి కొర్రపాటి సమయానికి అందుబాటులో లేకపోవడంతో భంగపడినట్లు తెలిసింది. ఈ బుక్స్ గురించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పూర్తిగా తెలిస్తే ‘వారాహి చలన చిత్రం’ కార్యాలయానికి కొంతకాలం భక్తులతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో విశ్రాన్తి ఉండదనేది కఠినమైన సత్యం. ఏదేమైనా సాయి కొర్రపాటి ప్రచురించే గ్రంధాలకు మంచి ఫాలోయింగ్ ఉందని ‘మా’ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. హెరిటేజ్ సంస్థలో ఈ ఉత్తమ గ్రంధాలను అందుకున్న సి ఓ ఓ జె . సాంబమూర్తి , హెడ్ ఆపరేషన్స్ అధికారి ఎల్. శ్రీనివాస్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Updated Date - May 11 , 2024 | 12:35 AM