Home » Sai Korrapati
వారాహి నవరాత్రుల పవిత్ర వేడుక సంరంభ సమయంలో ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రఖ్యాత ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ అపూర్వ రీతిలో ప్రచురించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంథం, మూడువందల పేజీల పరమ పవిత్ర స్తోత్ర, వ్యాఖ్యాన పారిజాతం ‘శ్రీ లలిత విష్ణు స్తోత్ర మంత్ర పేటిక’ను విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు వీణా వేడుక మధ్య సంగీతోత్సవానికి వెలుగుగా ఆవిష్కరించారు.
వారాహి చలన చిత్ర అధినేత, ‘ఈగ - లెజెండ్’ వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం ‘అమ్మణ్ణి’ గ్రంధాన్నిఆంధ్రప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్‌కు, ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటికి హిందూపూర్ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని ఆయన సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
ఎన్నో ఉద్విగ్నవేళల్ని, ఆపదలను తరిమి... అద్భుతాలను ప్రసాదించే ఈ శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈ శ్రీరామ నవమి కానుకగా వారాహి చలన చిత్రం అధినేత, శివవారాహీ ట్రస్ట్ చైర్మన్ , శ్రీ అమృతేశ్వరస్వామి దేవాలయం సంస్థాపకుడు సాయి కొర్రపాటి భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు విచ్చేసే వేలాది భక్తులకు ఉచితంగా అందజేసే సదుద్దేశంతో సుమారు యాభైవేల ప్రతులను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అందజేయనున్నారు.