ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chegunta: కాటి కాపరి జేబుకు క్యూఆర్‌ కోడ్‌

ABN, Publish Date - Nov 11 , 2024 | 05:05 AM

యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు.

  • శ్మశాన వాటికలో వినూత్నంగా భిక్షాటన

చేగుంట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. పరిస్థితులు మారడంతో చివరకు బిచ్చగాళ్లు కూడా క్యూఆర్‌ కోడ్‌లు పట్టుకుని తిరుగుతున్నారు. గాడిద పాలు అమ్మేవారు, గంగిరెద్దులు తిప్పేవారు కూడా ఆ జీవాలకు క్యూఆర్‌ కోడ్‌లు కట్టడం చూస్తున్నాం. అయితే, శ్మశాన వాటికలో కాటి కాపరులు సైతం క్యూఆర్‌ కోడ్‌ను జేబుకు పెట్టుకోవడం ఓ చోట ఆశ్చర్యాన్ని కలిగించింది.


మెదక్‌ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లికి చెందిన గణపురం బాలమణి అనారోగ్యంతో శనివారం మృతి చెందగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో శ్మశానానికి వచ్చిన ఓ కాటికాపరి డబ్బులు ఇవ్వాలంటూ అక్కడికి వచ్చిన వారిని అడిగాడు. దీంతో కొంత మంది తోచినంత ఇచ్చారు. మరికొందరు డబ్బులు లేవని చెప్పడంతో.. తన అంగీ జేబుకు ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను చూపించాడు. ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా డబ్బులు చెల్లించవచ్చని ఆ కాటికాపరి చెప్పడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.

Updated Date - Nov 11 , 2024 | 05:05 AM