ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:19 AM

తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయింది.

  • దక్షిణ భాగం ప్రాకార మండప తిరువీధుల్లో ఘటన

  • గుడిలో మరోసారి బయటపడ్డ నిర్మాణ లోపాలు

  • మ్యాట్లు, ఇసుక, కట్టెలతో నిండిన ప్రాకార మండపం

  • రిటైనింగ్‌ వాల్‌కు ఊడిన రాళ్లు

యాదాద్రి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్‌ రెండు అంగుళాల వరకు కుంగింది. దీంతో ప్రధానాలయానికి ఎటువంటి ప్రమాదం లేదని ఆలయ అధికారులు చెప్పారు. గత ప్రభుత్వం 2016లో ఆలయ ఉద్ఘాటన చేయాలని నిర్ణయించింది. ప్రధానాలయం పునర్నిర్మాణంతో పాటు ఆలయ విస్తరణకు దాదాపు రూ.1300 కోట్లతో పనులు చేపట్టారు. ఆరేళ్ల పాటు ఈ పనులు కొనసాగగా, 2022 మార్చి 28న ఉద్ఘాటన జరిగింది. ఆలయం పునర్నిర్మాణానికి ముందు 1.20 ఎకరాలు ఉన్న కొండను పూర్తిగా చదును చేయడంతో ప్రధానాలయ ప్రాంగణం 4.20 ఎకరాలకు చేరింది.


ఈ ప్రాంగణంలో స్వామివారి ప్రధానాలయంతో పాటు సప్తగోపురాలను నిర్మించారు. ఆలయం దక్షిణ భాగంలోని ప్రాకార మండపంలో వేసవిలో భక్తుల కాళ్ల కింద వాడిన మ్యాట్లు, వంట చెరకు వేయడంతో చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు ఇసుక నిండిపోయి కోతులకు ఆవాసంగా మారింది. అదేవిధంగా రిటైనింగ్‌ వాల్‌కు ఒక చోట బండలు ఊడిపోయాయి. ఆలయ పునర్మిర్నాణంలో దక్షిణ భాగంలో మట్టితో విస్తరించగా ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ (నల్లరాతి శిలలు) సుమారు 50 మీటర్ల పొడవున రెండు అంగుళాల లోతుకు కుంగింది. విస్తరణ సమయంలోనూ ఇదే ప్రదేశంలో కుంగిపోగా అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. మళ్లీ అక్కడే కుంగి కొన్ని నాపరాళ్లు పగిలిపోయాయి.


  • సేవల్లో సంప్రదాయానికి తిలోదకాలు

ఆలయంలో నిత్య కల్యాణోత్సవం, వెండి జోడు సేవలు నిర్వహించే క్రమంలో సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. భక్తులతో నిర్వహించే ఆర్జిత సేవలకు ఆలయం చుట్టూ తిరగాల్సి ఉంది. ఆలయం విస్తరణకు ముందు దక్షిణ భాగంలో సేవలతో పాటు భక్తులకు వెళ్లేందుకు వీల్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ పునర్మిర్నాణంలో భాగంగా దక్షిణ భాగాన్ని విస్తరించారు. అయినా ఆలయ సంప్రదాయం ప్రకారం సేవలు నిర్వహించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆలయంలోకి దిగే మెట్లు కూడా ఎక్కువగా ఉన్నందున సేవలను తరలించేందుకు అవకాశం తక్కువగా ఉంది. దీంతో సంప్రదాయబద్ధంగా స్వామివారి సేవలు ఆలయం చుట్టూ తిరగాల్సి ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.


  • గతంలో కురిసిన వర్షాలకు..

2022 మేలో కురిసిన భారీ వర్షాలకు ఆలయ పునర్నిర్మాణ పనుల్లో లోపాలు బయటపడ్డాయి. తిరువీధుల్లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ దిశలోని ఫ్లోరింగ్‌ దెబ్బతింది. ఈ ప్రాంతంలో సిమెంటు, మైనంతో పాటు కొన్ని చోట్ల సీసం నింపారు. రెండో ఘాట్‌కు అనుబంధంగా నిర్మించిన రోడ్డు కుంగింది. అష్టభుజి ప్రాకార మండపంలో వర్షపు నీటితో లీకేజీ ఏర్పడింది. లీకేజీలకు ఆస్కారం లేకుండా సిమెంటు, రసాయనాల మిశ్రమంతో గ్యాపులను పూడ్చారు. నిర్మాణ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినప్పటికీ మరోసారి నాణ్యతా లోపం బయటపడడం గమనార్హం.

  • మరమ్మతులు చేపడతాం

దక్షిణ భాగంలో ఫ్లోరింగ్‌ కుంగిన ప్రాంతానికి వెంటనే మరమ్మతులు చేపడతాం. ప్రధానాలయం దక్షిణ రాజగోపురం ప్రాకారానికి, కుంగిన ప్రదేశానికి సంబంధం లేదు. దక్షిణ తిరువీధుల్లో డ్రైనేజీ, ఇతర పైపులైన్లు కోసం వేసిన అదనపు కట్టడాల వల్ల కుంగింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం లేదు. - సునీల్‌, వైటీడీఏ ఇన్‌చార్జి ఈఈ


  • మరమ్మతులు చేపడతాం

దక్షిణ భాగంలో ఫ్లోరింగ్‌ కుంగిన ప్రాంతానికి వెంటనే మరమ్మతులు చేపడతాం. ప్రధానాలయం దక్షిణ రాజగోపురం ప్రాకారానికి, కుంగిన ప్రదేశానికి సంబంధం లేదు. దక్షిణ తిరువీధుల్లో డ్రైనేజీ, ఇతర పైపులైన్లు కోసం వేసిన అదనపు కట్టడాల వల్ల కుంగింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం లేదు. - సునీల్‌, వైటీడీఏ ఇన్‌చార్జి ఈఈ


  • వైటీడీఏ పనులు అర్ధాంతరంగా ఎందుకు ఆపారు?

  • భూ సేకరణ, పరిహారంపై నివేదిక ఇవ్వండి

  • అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టలో గత ప్రభుత్వ హయాంలో ‘యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)’ చేపట్టిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ప్రశ్నించారు. వైటీడీఏ చేపట్టిన అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపు, భూ సేకరణ, నష్టపరిహారం తదితర అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు. బుధవారం ఆమె సచివాలయంలో వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైటీడీఏ సమర్పించిన అసమగ్ర సమాచారంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సమగ్ర సమాచారాన్ని గురువారంలోగా అందజేయాలని వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌ రావును ఆదేశించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హంగు, ఆర్భాటాలకు పోయిందే తప్ప సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం ఆలయ ప్రాముఖ్యతను పెంచడంతోపాటు సాధారణ భక్తులకు సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని చెప్పారు.

Updated Date - Nov 07 , 2024 | 03:19 AM