ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాధాకిషన్‌ రావు బెదిరించి ప్లాటు రాయుంచుకున్నాడు

ABN, Publish Date - Apr 20 , 2024 | 10:54 AM

టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ, ఓఎ్‌సడీ రాధాకిషన్‌ రావు తనను బెదిరించి రూ. కోటి విలువైన ప్లాటును రాయించుకున్నాడని రియల్టర్‌ మునగపాటి సుదర్శన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

- టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో బంధించి కొట్టాడు

- కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రియల్టర్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ/సనత్‌నగర్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ, ఓఎస్డీ రాధాకిషన్‌ రావు తనను బెదిరించి రూ. కోటి విలువైన ప్లాటును రాయించుకున్నాడని రియల్టర్‌ మునగపాటి సుదర్శన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో రియల్టర్‌ సుదర్శన్‌ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సనత్‌నగర్‌కు బదిలీ చేయడంతో బాధితుడు సుదర్శన్‌ శుక్రవారం సనత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. రాధాకిషన్‌ రావు తనను సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో బంధించారని, పలుమార్లు కొట్టడంతోపాటు తన కుటుంబసభ్యులను భయబ్రాంతులను చేసినట్లు తెలిపాడు. తనకు డబ్బులు చెల్లించకుండానే అక్రమంగా తన పేరున ఉన్న ప్లాట్‌ను రాయించుకున్నారని చెప్పాడు. ‘‘పోలీసులు న్యాయం చేస్తారని నమ్మి ఫిర్యాదు చేశాను... రాధాకిషన్‌ రావు బయటకి వచ్చేలోగా తన ప్లాట్‌ తనకు ఇప్పించాలి.’’ అని కోరాడు.

Updated Date - Apr 20 , 2024 | 10:54 AM

Advertising
Advertising