BJP's Medak MP candidate
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:11 AM
కేసీఆర్ అంటే ఆరంభం.. ఆర్భాటం.. అంతం అని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు అన్నారు. ఆరంభించడం, ఆర్భాటం చేయడం, అంతం చేయడం అన్నీ కేసీఆర్ చేస్తారని తెలిపారు. భస్మాసురుడి వల్లే కేసీఆర్ తన తలపై తన భస్మాసుర హస్తం
కేసీఆర్ అంటే ఆరంభం, ఆర్భాటం, అంతం
దిగ్విజయ్ చేసిన తప్పు వల్లే బీఆర్‌ఎస్ ఉంది
సీఎం రేవంత్ కుడి, ఎడమ చూసుకోవాలి
కుర్చీ ఎవరు లాగేస్తారో తెలియని పరిస్థితి
మీట్ ది ప్రెస్‌లో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ అంటే ఆరంభం.. ఆర్భాటం.. అంతం అని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు అన్నారు. ఆరంభించడం, ఆర్భాటం చేయడం, అంతం చేయడం అన్నీ కేసీఆర్ చేస్తారని తెలిపారు. భస్మాసురుడి వల్లే కేసీఆర్ తన తలపై తన భస్మాసుర హస్తం పెట్టుకుంటారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుడి, ఎడమలను జాగ్రత్తగా చూసుకోవాలని, సీఎం కుర్చీని ఎవరు లాగేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో రఘునందన్‌రావు పలు అంశాలపై మాట్లాడారు. నిజానికి, బీఆర్‌ఎస్ ఎప్పుడో కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిందని అన్నారు. కానీ, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన తప్పు వల్ల బీఆర్‌ఎస్ పదేళ్ల పాటు బతికిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చా రని, కేసీఆర్ తన ఫాంహౌస్‌ను వ్యవసాయ పరిశోధన కేంద్రంగా మార్చు కుంటే మంచిదని హితవు పలికారు. తాను అసెంబ్లీలో అడుగుపెడితే వాళ్లకు కుర్చీలు ఉండవనే భయంతో తండ్రీకొడుకులు(కేసీఆర్, కేటీఆర్) తనని దుబ్బాక ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. ఇక, రఘునందన్‌కు దుబ్బాకలో గడీ ఉందని సీఎం రేవంత్ అంటున్నారని, అది నిరూపిస్తే సొంత ఖర్చులతో ఆ గడీని ముఖ్యమంత్రి పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కవల పిల్లలని, ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డును అష్ట వంకరలు తిప్పిన వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మెదక్‌తో ఏం సంబంధం ఉందని వెంకట్రామిరెడ్డిని బీఆర్‌ఎస్ పోటీలో నిలబెట్టిందని నిలదీశారు. మెదక్‌లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను తాను సమర్థించననిపేర్కొన్నారు. అయితే, పార్టీ మారాలనుకునే వారు పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఆయన అన్నారు.