Raghunandan Rao: లడ్డూ వివాదానికి సిట్ ముగింపునివ్వాలి
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:12 AM
శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
వేంకటేశ్వరస్వామి ప్రసాదం విషయంలో వచ్చిన గందరగోళానికి సుప్రీం కోర్టు తొందరగానే తెరదించిందన్నారు. దీనిపై ఏర్పాటు చేసిన సిట్.. విచారణను వేగవంతంగా చేయాలన్నారు.
Updated Date - Oct 07 , 2024 | 04:12 AM