ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: రెండు రోజుల సమయం ఇవ్వండి

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:52 AM

జన్వాడ ఫాంహౌస్‌ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ పాకాలకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రాజ్‌ పాకాల అలియాస్‌ పాకాల రాజేంద్రప్రసాద్‌కు న్యాయస్థానం రెండు రోజుల సమయం ఇచ్చింది.

  • ఆలోపు రాజ్‌ పాకాల పోలీసుల ఎదుట హాజరు కావాలి

  • విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చు: హైకోర్టు

  • ఫాంహౌస్‌ కేసులో ఆదేశాలు కేటీఆర్‌ బావమరిదిని కాబట్టే టార్గెట్‌ చేశారు: రాజ్‌ పాకాల

  • సహకరించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు

  • జన్వాడ ఫాంహౌస్‌ పార్టీ కేసులో హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జన్వాడ ఫాంహౌస్‌ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ పాకాలకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రాజ్‌ పాకాల అలియాస్‌ పాకాల రాజేంద్రప్రసాద్‌కు న్యాయస్థానం రెండు రోజుల సమయం ఇచ్చింది. రెండు రోజుల తర్వాత పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. పోలీసుల ఎదుట హాజరై కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని తెలిపింది. ఫాంహౌస్‌ పార్టీ కేసులో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తన వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని, బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్‌ 35 ప్రకారం ముందస్తు నోటీసు ఇచ్చేలా ఆదేశించాలని, కేసు దర్యాప్తుపై స్టే విధించాలని కోరుతూ రాజ్‌ పాకాల హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘కేటీఆర్‌ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. పిటిషనర్‌ కేటీఆర్‌ బావమరిది కాబట్టి రాజకీయ కక్ష సాధింపు, దురుద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించి వేధించాలని చూస్తున్నారు. ఇంట్లో జరిగే వేడుకలపై దాడులు చేస్తారా? అక్కడ ఉండే ఉద్యోగికి పాజిటివ్‌ వస్తే పిటిషనర్‌ను ఎలా నిందితుడిగా చేరుస్తారు? నూతన గృహప్రవేశం సందర్భంగా వేడుకలు చేసుకోరా? ఉదయం 9.30 గంటలకు నోటీసు ఇచ్చి 11 గంటలకు హాజరు కావాలంటే ఎలా? ఇటీవల ఒక మంత్రి కేటీఆర్‌పై తీవ్ర పదజాలంతో పరువునష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి దీపావళిలోపు రాజకీయ బాంబులు పేలతాయని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షలో భాగంగానే గృహప్రవేశ వేడుకలపై దాడులు చేశారు. రాత్రి సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా ఎక్సైజ్‌ అధికారులు, ఎస్‌వోటీ పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారు. బంధువులతో వేడుకల్లో ఉండగా నార్కోటిక్‌ పరీక్షల కోసం పిటిషనర్‌ను నిర్బంధించడంతోపాటు మహిళలని చూడకుండా శాంపిల్స్‌ కోసం ఇబ్బందులకు గురిచేశారు. ఎలాంటి డ్రగ్స్‌ దొరక్కపోయినా తప్పుడు కేసులు నమోదు చేశారు.


ఈ అక్రమ కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వడంతోపాటు అరె్‌స్టను అడ్డుకోవాలి’’ అని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘రాజకీయ దురుద్దేశం అనేది కేవలం ఆరోపణ మాత్రమే. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చాం. హాజరవకపోతే అరెస్ట్‌ చేస్తామని సాధారణంగా నోటీసులో ఉంటుంది. పిటిషనర్‌ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌ చేసే ఉద్దేశం పోలీసులకు లేదు. అది కేవలం పిటిషనర్‌ ఆందోళన మాత్రమే. పిటిషనర్‌కు సన్నిహితుడైన మద్దూరి విజయ్‌కి కొకైన్‌ పాజిటివ్‌ వచ్చింది. అనుమతిలేని మద్యం సీసాలు లభించాయి. దర్యాప్తు ప్రారంభ దశలో ఉండగానే కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వరాదు. దర్యాప్తులో ఆధారాలు లభిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. విదేశీ మద్యం, డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం తనిఖీలు చేపట్టాం.


కొకైన్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పిటిషనర్‌కు అత్యంత సన్నిహితుడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘‘పిటిషనర్‌ ఇటీవలే జన్వాడకు మారినందున గృహప్రవేశ వేడుకలు నిర్వహించినట్లు చెబుతున్నారు. అతిథులకు మద్యం ఇచ్చామే తప్ప డ్రగ్స్‌ ఇవ్వలేదంటున్నారు. మద్దూరి విజయ్‌కి కొకైన్‌ పాజిటివ్‌ వచ్చింది కాబట్టి డ్రగ్స్‌ వినియోగం నేపథ్యంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందని ఏఏజీ చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు బీఎన్‌ఎ్‌స 35 నోటీసును 28న (సోమవారం) పిటిషనర్‌కు అందజేశారు. ఎలాంటి సమయం ఇవ్వలేదు కాబట్టి దర్యాప్తు పారదర్శకతపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. నోటీసుకు స్పందిస్తూ దర్యాప్తుకు సహకరిస్తున్నంత వరకు పిటిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దు. పోలీసుల నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు రెండురోజుల సమయం ఇవ్వాలి. న్యాయవాదితో కలిసి పిటిషనర్‌ పోలీసుల ఎదుట హాజరుకావచ్చు. పోలీసులు చట్టప్రకారం వ్యవహరించవచ్చు’’ అని పేర్కొంది. ఒకవేళ డ్రగ్స్‌ వినియోగించినట్లు తేలినా ఆరు నెలలే జైలుశిక్ష పడుతుంది కాబట్టి.. అలాంటి సందర్భాల్లోనూ ముందుగా నోటీసు ఇవ్వాలి కదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


  • శ్రవణ్‌రావు బెయిల్‌పై వివరణ కోరిన హైకోర్టు

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని పేర్కొంటూ ఈ కేసులో ఏ-6గా ఉన్న శ్రవణ్‌కుమార్‌ రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవని పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌స పార్టీలో చేరాలని తాను ఇతర పార్టీల నాయకులను కోరినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని.. అయితే, ఇతర నిందితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం.. బెయిల్‌ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ పోలీసులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నవంబరు 7కు వాయిదా వేసింది.


  • పబ్బుల వల్ల రోడ్డు ప్రమాదాలు

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో పబ్బుల వల్ల భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టాలని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌కు ధర్మాసనం సూచించింది. బడాబాబుల పిల్లలు పబ్బుల్లో హంగామా చేస్తూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారని, పబ్బులను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొంది. జూబ్లీహిల్స్‌ ప్రాంతాంలో దాదాపు 60 వరకు పబ్బులు ఉన్నాయని.. అక్కడ స్పెషల్‌ డ్రైవ్‌లు పెట్టాలని పేర్కొంది. అక్కడ రోజూ కనీసం ఒక్క ప్రమాదం అయినా జరుగుతోందని వ్యాఖ్యానించింది.

Updated Date - Oct 29 , 2024 | 03:52 AM