TS News: దైవదర్శనానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి షాక్...
ABN, Publish Date - Apr 13 , 2024 | 10:35 AM
Telangana: ఆ వ్యాపారి కుటుంబీకులు అంతా ఎంతో ఉత్సాహంగా దైవదర్శనానికి వెళ్లారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే ఇంటికి వచ్చిన చూసిన ఆ కుటుంబీకులకు మాత్రం పెద్ద షాకే తగిలింది. అయ్యో ఎంత పని జరిగిదంటూ యజమానులు లబోదిబోమని మొత్తుకున్నారు. ఇంతకీ వాళ్లు తిరిగివచ్చేసే సరికి ఏం జరిగిందనే దానిపై వివరాలలోకి వెళ్తే...
రంగారెడ్డి, ఏప్రిల్ 13: ఆ వ్యాపారి కుటుంబీకులు అంతా ఎంతో ఉత్సాహంగా దైవదర్శనానికి వెళ్లారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే ఇంటికి వచ్చిన చూసిన ఆ కుటుంబీకులకు మాత్రం పెద్ద షాకే తగిలింది. అయ్యో ఎంత పని జరిగిదంటూ యజమానులు లబోదిబోమని మొత్తుకున్నారు. ఇంతకీ వాళ్లు తిరిగివచ్చేసే సరికి ఏం జరిగిందనే దానిపై వివరాలలోకి వెళ్తే...
ఇవి తాగితే కరోనా రాదని చిత్తూరులో ప్రచారం.. తీరా చూస్తే..!
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా...
జిల్లాలోని రాజేంద్రనగర్ (Rajendranagar) దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ చేసిన దుండగులు.. అదును చూసి ఇళ్లను గుళ్ల చేశారు. రాజేంద్రనగర్ బండ్లగూడ వికాస్ నగర్‌కాలనీలో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దుండగులు చోరీకి తెగబట్టారు. నవీన్ అనే వ్యాపారి ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, వెండి ఆభరణాలలతో పాటు రూ.25 వేల నగదును దుండగులు దోచుకెళ్లారు. వ్యాపారి కుటుంబం ఇంటికి తాళం వేసి దైవ దర్శనం నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి చేరుకున్న నవీన్.. డోర్ ధ్వంసం చేసి ఉండడాన్ని గుర్తించాడు. వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు వ్యాపారి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు (Police) సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పలు ఆధారాలను కాప్స్ సేకరించారు. తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసి మరీ దుండగులు చోరికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Phone Tapping: రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు.. చిన్ననాటి మిత్రుడి కోసం...
AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 13 , 2024 | 10:36 AM