Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్..
ABN, Publish Date - Jul 21 , 2024 | 10:09 AM
మెట్రో రైలు టికెట్(Metro train ticket) తీసుకోవడం ఇక మరింత సులువు కానుంది. లైన్‌లో వెళ్లి సరైన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యే ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో కొత్త ఒప్పందాన్ని చేసుకుంది.
హైదరాబాద్ సిటీ: మెట్రో రైలు టికెట్(Metro train ticket) తీసుకోవడం ఇక మరింత సులువు కానుంది. లైన్‌లో వెళ్లి సరైన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యే ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో కొత్త ఒప్పందాన్ని చేసుకుంది. ఇందుకనుగుణంగా నగరంలో స్టేషన్‌కు వెళ్లకుండానే ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో మెట్రో టికెట్‌ను బుక్ చేసుకునేలా ర్యాపిడో యాప్‌లో వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు శనివారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్(Ameerpet Metro Station)లో ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి సేవలను ప్రారంభించారు.
ఇదికూడా చదవండి: ఇంటి తాళాలు పగులకొట్టి 30 తులాల బంగారు చోరీ...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజారవాణాను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(Metro MD NVS Reddy) మాట్లాడుతూ ర్యాపిడోతో కొత్త భాగస్వామ్యం ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందిస్తుందన్నారు. ర్యాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 21 , 2024 | 10:09 AM