ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vẽṅkaṭaratnam: ప్రముఖ కవి అడిగోపుల కన్నుమూత..

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:31 AM

ప్రసిద్ధ కవి అడిగోపుల వెంకటరత్నం (83) శుక్రవారం ఉదయం తిరుపతిలో కన్నుమూశారు. 50 ఏళ్లుగా కవిత్వం రాస్తున్న ఆయన 28 కవితా సంపుటాలను వెలువరించారు.

  • 28 కవితాసంపుటాలు వెలువరించిన వెంకటరత్నం

  • నేడు స్వస్థలం నెల్లూరుకు భౌతికకాయం తరలింపు

తిరుపతి (కల్చరల్‌), జూలై 19: ప్రసిద్ధ కవి అడిగోపుల వెంకటరత్నం (83) శుక్రవారం ఉదయం తిరుపతిలో కన్నుమూశారు. 50 ఏళ్లుగా కవిత్వం రాస్తున్న ఆయన 28 కవితా సంపుటాలను వెలువరించారు. ఆయన స్వస్థలం నెల్లూరు. ఇంజనీరుగా నాగార్జున వర్సిటీలో ఉద్యోగ విరమణ పొందిన తరువాత తిరుపతిలో స్థిరపడ్డారు. ఇటీవలే ఆయన కవితాసంపుటి ‘నిలువెత్తు సంతకం’ ఆవిష్కరణ జరిగింది. నూతలపాటి, తానా, విశాలాక్షి సహా 20కిపైగా సత్కారాలను ఆయన అందుకున్నారు.


అడిగోపుల వెంకటరత్నం రచనలపై శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, నాగార్జున వర్సిటీల్లో పరిశోధనలు జరిగాయి. కాగా, తిరుపతి ఎన్‌జీవో కాలనీలోని వెంకటరత్నం నివాసంలో వారి భౌతికకాయాన్ని పలువురు సాహితీకారులు సందర్శించి, నివాళి అర్పించారు. వెంకటరత్నం కుమారుడు విదేశాల నుంచి రావలసి ఉంది. దీంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఆయన భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Jul 20 , 2024 | 05:31 AM

Advertising
Advertising
<