ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:25 AM

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

  • రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జెన్‌కో చర్యలు

  • త్వరలో టెండర్లు నిర్వహించేందుకు కసరత్తు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం వాటిల్లింది. దీనికి జర్మనీ కంపెనీ వైత్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. గత ఏడాది జూలైలో 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత ఫాల్ట్‌ రావడంతో 4వ యూనిట్‌ మళ్లీ కాలిపోయింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే కాలిపోయినందున ఒప్పందం ప్రకారం సొంత ఖర్చుతో మరమ్మతు చేయాలని ‘వైత్‌’ గ్రూపును జెన్‌కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడం వల్లే ఫాల్ట్‌ ఏర్పడిందని, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.


ఏడాదిపాటు ఈ వివాదం నడవడంతో మరమ్మతుల అంశం మరుగున పడిపోయింది. అయితే, ఈ విషయమై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరమ్మతులు చేపట్టాలని జెన్‌కోను ఆదేశించింది. మరమ్మతులకు రూ.3కోట్లు మాత్రమే ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువైన జల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రస్తావించింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్‌కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అయితే, మరమ్మతులు పూర్తయు 4వ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, ఆలోగా కృష్ణాలో వరదలు తగ్గుముఖం పడుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Jun 28 , 2024 | 05:26 AM

Advertising
Advertising