CM Revanth Reddy: సామాన్య కార్యకర్తకు గుర్తింపు ఇచ్చారంటూ.. మోదీపై రేవంత్ మరోసారి ప్రశంసల జల్లు..
ABN, Publish Date - Aug 18 , 2024 | 08:41 PM
ప్రధాని నరేంద్రమోదీని బడే బాయ్ అంటూ సంబోధించడం ద్వారా సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీపై పరోక్షంగా ప్రశంసలు కురిపించారు.
ప్రధాని నరేంద్రమోదీని బడే బాయ్ అంటూ సంబోధించడం ద్వారా సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీపై పరోక్షంగా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో జరిగిన క్షత్రియ సేవా సమితి అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన సామాన్య కార్యకర్తను గుర్తించి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు ప్రధాని మోదీ కేంద్రమంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కర్ణాటక రాష్ట్ర మంత్రి బోసురాజు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో సేవలందించిన బోసురాజు శాసనసభ ఎన్నికల్లో పోటీచేయకపోయినా.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనను మంత్రిపదవితో గౌరవించి.. ఎమ్మెల్సీని చేసిందన్నారు. అలాగే 30 ఏళ్లకు పైగా బీజేపీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడిన సామాన్య కార్యకర్తను కేంద్రమంత్రిని చేసిందంటూ ప్రశంసించారు. కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజుతో తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. శ్రీనివాసవర్మ గురించి అప్పుడప్పుడు కృష్ణంరాజు తనతో ప్రస్తావించేవారన్నారు. గోదావరి జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు తీవ్ర పోటీ ఉంటుందని, పెట్టుబడి పెట్టేవారు టికెట్ల కోసం పోటీపడతారన్నారు. కానీ శ్రీనివాసవర్మ దగ్గర నిబద్ధత, శ్రమ ఉందని డబ్బులు మాత్రం లేవన్నారు. పార్టీ వేరైనా బీజేపీ శ్రీనివాసవర్శకు టికెట్ ఇచ్చిందన్నారు. టికెట్ ఇచ్చినా.. గెలవడం కష్టమని.. ప్రజలు గుర్తించి కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే నరేంద్రమోదీ శ్రీనివాసవర్మను మంత్రిని చేశారన్నారు.
KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..
ఆ ఇద్దరూ శ్రమ జీవులే..
క్షత్రియ సేవా సమితి అభినందన సభ కార్యక్రమంలో భాగంగా వేదికపై ఉన్న శ్రీనివాసవర్మ, బోసురాజు విధేయతకు, శ్రమకు, నిబద్ధతకు నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్ధాంతపరంగా ఇద్దరి మధ్య వైరుద్యాలు ఉన్నా నిబద్ధతలో మాత్రం ఆ ఇద్దరికీ సారుప్యత ఉందన్నారు. ఇద్దరూ క్షత్రియ సామాజికవర్గం నుంచి రావడం, వేదికపై ఉండటం ద్వారా భవిష్యత్తు తరాలకు చక్కటి సందేశం వెళ్తుందన్నారు. కష్టపడి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తే పదవులు వస్తాయనడానికి ఉదాహరణగా శ్రీనివాసవర్మ, బోసురాజు వేదికపై ఉండటం సంతోషకరమన్నారు. కేంద్రమంత్రి పదవి ప్రకటించగానే శ్రీనివాసవర్శకు తాను స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి సంఘటన ద్వారా కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుందని, కష్టపడి పనిచేస్తే అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంటుందన్నారు.
KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..
క్షత్రియలకు చట్టసభల్లో ప్రాధాన్యత..
తెలంగాణలో క్షత్రియులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ చైతన్యం ఉండి.. రాజకీయాల్లో రాణించాలనే ఆలోచన ఉన్నవారిని ప్రోత్సహించాలని క్షత్రియ సేవా సమితి నాయకులకు సూచించారు. పార్టీలో పదవులు ఇస్తామని.. ఆ తర్వాత టికెట్లు ఇస్తామన్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ప్రతినిధులుగా ఎవరిని కాంగ్రెస్ పార్టీలో పెట్టాలనుకుంటున్నారో వారి జాబితా ఇస్తే వాళ్లందరినీ నాయకులుగా తయారుచేసి.. రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు.
Hyderabad News: కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా.. ఎక్కడంటే?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Reda More Telugu News and Latest Telugu News
Updated Date - Aug 18 , 2024 | 08:51 PM