Revenue Inspector: లంచం తీసుకున్నా పని చేయట్లేదు!
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:51 AM
తమ భూము ల వివరాలు ధరణి పోర్టల్‌లో తప్పుగా నమోదు కావడంతో సరి చేయాలంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఆశ్రయిస్తే.. లంచం తీసుకోని కూడా పని చేయడం లేదంటూ కొందరు రైతులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
ఆర్‌ఐపై ఆర్డీవోకురైతుల ఫిర్యాదు
పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): తమ భూము ల వివరాలు ధరణి పోర్టల్‌లో తప్పుగా నమోదు కావడంతో సరి చేయాలంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఆశ్రయిస్తే.. లంచం తీసుకోని కూడా పని చేయడం లేదంటూ కొందరు రైతులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. గురువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి తహసీల్దార్ కార్యాలయానికి దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి రాగా.. ఆయన సమక్షంలోనే ఆర్‌ఐ శీలం క్రాంతిని డబ్బుల విషయమై రమావత్ పాండుతోపాటు మరికొంత మంది రైతులు నిలదీశారు. 2022 నుంచి విడతల వారీగా రూ.50 వేలను పాండు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఇటు మరో రైతు రమావత్ మకీలా కూడా రూ.5 వేలు ఇచ్చాడు. అయినా ఆ రైతుల పని పూర్తి చేయలేదు. దీంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
Updated Date - Dec 20 , 2024 | 05:51 AM