NEET: 2-3 రోజుల్లో నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు..
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:32 AM
సవరించిన నీట్ ఫలితాలను ఎన్‌టీఏ మూడ్రోజుల క్రితం విడుదల చేసిన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎ్‌స) విడుదల చేయనుంది.
రాష్ట్రాలవారీగా జాబితా సిద్ధంచేస్తున్న డీజీహెచ్‌ఎ్‌స
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సవరించిన నీట్ ఫలితాలను ఎన్‌టీఏ మూడ్రోజుల క్రితం విడుదల చేసిన నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎ్‌స) విడుదల చేయనుంది. తాజా ఫలితాల్లో చాలా మంది ర్యాంకులు మారాయి. ప్రస్తుతం డీజీహెచ్‌ఎ్‌స రాష్ట్రాలవారీగా అభ్యర్థుల ర్యాంకుల జాబితాను సిద్ధం చేస్తోంది. ఆ డేటాను రాష్ట్రాలకు పంపనుంది.
తొలుత ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులు విడుదల చేస్తారు. అనంతరం హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తుంది. కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి అనేది వెల్లడికావాల్సి ఉంది. ఈసారి రాష్ట్రం నుంచి 77,849మంది నీట్ పరీక్ష రాయగా.. అందులో మొదట విడుదల చేసిన ఫలితాల్లో 47,371మంది ఉత్తీర్ణత సాఽధించారు. సవరించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత పొందారు. 15 మంది అర్హత కోల్పోయారు.
తొలుత 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్
తొలుత 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎ్‌సఐసీ, ఏఎ్‌ఫఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూలలో ఉండే సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ వివరాలు, షెడ్యూల్ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖతో సహా అన్ని రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్ల కోసం నీట్ ర్యాంకర్లు తమ సొంత రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ర్యాంక్ ఆధారంగా సంబంధిత కౌన్సెలింగ్ అధికారులు మెరిట్ జాబితా తయారు చేస్తారు.
Updated Date - Jul 29 , 2024 | 03:32 AM