ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: అదుపు తప్పాయి..

ABN, Publish Date - Dec 10 , 2024 | 03:37 AM

నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్‌ బస్సు 46మంది ప్రయాణికులతో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరింది.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌ మృతి

చౌటుప్పల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్‌ బస్సు 46మంది ప్రయాణికులతో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం గ్రామ సమీపంలో మైసమ్మ ఆలయం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డైవ్రర్‌ ఎండీ.సలీంపాషా(47) అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులోని 10మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికుడు వాసిరెడ్డి శ్రీకాంత్‌కు కాలు విరిగింది.


టైరు పేలి.. చెట్లలోకి దూసుకెళ్లి

చిట్యాల రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదివారం రాత్రి 42 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలు దేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి శివారు వద్ద బస్సు ముందు టైౖరు పేలిపోయింది. అదుపుతప్పిన బస్సు.. డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు రోడ్డు పక్కనున్న చెట్లపొదల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.


పొలాల్లోకి స్కూలు బస్సు

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ పట్టణంలోని చాణక్య విజన్‌ ప్రైవేటు పాఠశాల బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. మేడ్చల్‌ జిల్లా, బండమాదారం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.


గుంతలు తప్పించబోయి..

మాడ్గుల/ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌, డిసెంబరు9(ఆంద్రజ్యోతి): ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బ్రాహ్మణపల్లి మీదుగా ఇర్విన్‌, చారగొండకు వెళ్తోంది. పాటిగడ్డ వద్ద రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు ప్రయత్నించగా బస్సు పక్కనే ఉన్న మైలురాయిని ఢీకొట్టింది. దీంతో ముందు వీల్‌ రాడ్‌ విరిగి పోయి బస్సు పొలంలోకి దూసుకుపోయింది. బస్సులో 130 మందివరకు ఉండగా కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ అప్రమత్తతో ప్రమాదం తప్పిందని డిపోమేనేజర్‌ వెల్లడించారు. మరో ఘటనలో వికారాబాద్‌నుంచి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును పక్కనే ఉన్న గుంతలోకి తీసుకెళ్లి నిలిపివేశాడు. ఆ సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 03:37 AM