ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను తొలగించిన సాక్షి

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:20 AM

వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’.. ఎట్టకేలకు తన వెబ్‌సైట్‌ నుంచి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను తొలగించింది.

  • కుట్రపై వరుస వార్తా కథనాలతో తొలగింపు

  • క్షమాపణపై మౌనం..

  • న్యాయపరమైన చర్యలు తప్పవన్న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’.. ఎట్టకేలకు తన వెబ్‌సైట్‌ నుంచి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను తొలగించింది. పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన సాక్షి.. ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను వాడి, తన వెబ్‌సైట్లో తమ సొంత వార్తలను ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ అని గూగుల్‌లో వెతికినా.. వీక్షకులు సాక్షి వెబ్‌సైట్‌కు అనుసంధానమయ్యేలా చేసింది. ‘సాక్షి’ విశ్వసనీయత లేని వార్తలను బలవంతంగా ప్రజల్లోకి ఎక్కించేందుకు కుట్రలు పన్నింది. ఈ వ్యవహారం జనాలను సైతం గందరగోళానికి గురిచేసింది.


ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఐటీ బృందం పసిగట్టింది. సాక్షి కుట్రను ఎండగడుతూ.. వరుస వార్తా కథనాలు ప్రసారం చేసింది. ఈ అంశంపై ప్రజల్లోనూ వ్యతిరేకతను ఎదుర్కొన్న ‘సాక్షి’ తమ వెబ్‌సైట్‌ నుంచి ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ తొలగించింది. తామేం తప్పు చేయలేదన్నట్టు నిశ్శబ్ధంగా సైడ్‌ అయింది. అయితే అక్రమంగా ట్యాగ్‌ వాడినందుకు క్షమాపణ కూడా చెప్పలేదు. చేసిన తప్పునకు ‘సాక్షి’ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ‘ఏబీన్‌-ఆంధ్రజ్యోతి’ హెచ్చరించింది.

Updated Date - Oct 08 , 2024 | 03:20 AM