TG News: హై కమాండ్‌కు ఆ విషయంపై లేఖ రాశా.. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 22 , 2024 | 05:29 PM
ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. మాదిగ జాతిని బీజేపీ, బీఆర్ఎస్ అణగదొక్కాయని ధ్వజమెత్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga)ను హెచ్చరించారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)కి తాకట్టు పెట్టొద్దని అన్నారు. రిజర్వేషన్లకు మొదటి అడుగు వేసిందే కాంగ్రెస్ అని చెప్పారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్‌నే న్యాయబద్దంగా రిజర్వేషన్లను అమలు చేయగలదని మంద కృష్ణ మాదిగ చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ హయాంలో వర్గీకరణ రాష్ట్రాలకు అప్పజెప్పాలనీ ఉషా మెహ్రా కమిషన్‌ను కాంగ్రెస్ వేసిందని తెలిపారు. పదేళ్లపాటు మాదిగలను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిలువునా ముంచాయని విరుచుకుపడ్డారు.
TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
పదేళ్ల కేసీఆర్ పాలనలో మాదిగలు ఆగమవుతుంటే మంద కృష్ణ మాదిగ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉషా మెహ్రా కమిషన్ వేసిందని మంద కృష్ణకు తెలియదా..? అని నిలదీశారు. 341( a) సవరించి ఉషా మెహ్రా కమిషన్ నివేదికను బీజేపీ ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..? అని నిలదీశారు. బీజేపీనే దళితుల వ్యతిరేక పార్టీ, దళితుల హక్కులను కాలరాసే పార్టీ అని చెప్పారు. మనువాద పార్టీ బీజేపీని భుజాన ఎత్తుకోవడం మంద కృష్ణకు మంచిది కాదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. మాదిగలకు తమ పార్టీలోనే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ చరిత్రే సామాజిక న్యాయమని చెప్పారు. మోదీ కౌగిలింతలకు మందకృష్ణ లొంగిపోయారా..? అని ఎద్దేవా చేశారు. బీజేపీని మోయమంటున్న మంద కృష్ణ పదేళ్లలో ఆ పార్టీ దళితులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. దళిత బిడ్డ అయినందుకే సంపత్ కుమార్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని మంద కృష్ణ అంటున్నారని చెప్పారు.
గ్రామీణ బిడ్డ అయినా తనను గుర్తించి కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేసిందని తెలిపారు. కాంగ్రెస్ తనకు గాడ్ ఫాదర్‌లాంటిదని అన్నారు. మరో 20 ఏళ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటుందని చెప్పారు. దళితుల ఆత్మ గౌరవాన్ని మంద కృష్ణ మోదీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లేకుంటే ఆయన ఎక్కడ ఉండేవారో తెలుసుకోవాలని అన్నారు. మంద కృష్ణ కళ్లకు బీజేపీ ముసుగు తొడిగిందని మండిపడ్డారు. మాదిగల జాతికే వ్యతిరేకమైన కమలం పార్టీని ఆయన ఎందుకు మోస్తున్నారో, ఎలా అంటకాగుతున్నారో జవాబు చెప్పాలని అన్నారు. తనకు అన్యాయం జరుగుతుందని హై కమాండ్‌కు లేఖ రాశానని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ గొడుగు కింద ఎదిగానని.. ఆ గొడుగు కిందే ఒదిగి ఉంటానని సంపత్ కుమార్ అన్నారు.
సంపత్ కుమార్‌తో మల్లు రవి భేటీ.. కారణమిదే..?
కాగా అంతకు ముందు... మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి శుక్రవారం నాడు భేటీ అయ్యారు. సంపత్ ఇంటికి వెళ్లి తనకు సహకారం అందించాలని కోరారు. నిన్నటి వరకు నాగర్ కర్నూల్ స్థానాన్ని సంపత్ ఆశించారు. సీఎం రేవంత్‌రెడ్డిని సంపత్, మల్లు రవి కలిశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ విజయానికి చేయాల్సిన వ్యూహంపై చర్చించారు. మల్లు రవి, సంపత్ కుమార్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. నాగర్ కర్నూల్‌లో విజయం సాధించేందుకు ఇద్దరు నాయకులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు.
Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే శుభకార్యం అంటూ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 22 , 2024 | 05:33 PM