ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sandhya Theater: ‘మైత్రీ’ ఆధీనంలోనే ‘సంధ్య’ ?

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:23 AM

తొక్కిస లాట ఘటన జరిగిన డిసెంబరు 4వ తేదీతోపాటు 5వ తేదీ కూడా తమ థియేటర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ఆధీనంలోనే ఉందని సంధ్య థియేటర్‌ యాజమాన్యం తెలిపింది.

  • సీపీ షోకాజ్‌ నోటీసుకు యాజమాన్యం స్పందన

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తొక్కిస లాట ఘటన జరిగిన డిసెంబరు 4వ తేదీతోపాటు 5వ తేదీ కూడా తమ థియేటర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ఆధీనంలోనే ఉందని సంధ్య థియేటర్‌ యాజమాన్యం తెలిపింది. ఆ రోజు థియేటర్‌ సిబ్బంది 80 మంది విధుల్లో ఉన్నారని వెల్లడించింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ‘మీ థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదు?’ చెప్పండి అంటూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు సంధ్య యాజమాన్యం ఈ మేరకు వివరణ ఇచ్చినట్టు సమాచారం.


సినిమా విడుదల సందర్భంగా గతంలో అనేక సందర్భాల్లో సినిమా హీరోలు తమ థియేటర్‌కు వచ్చారని ఆ వివరణలో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే, వాహనాల పార్కింగ్‌కు తమ థియేటర్‌లో ప్రత్యేక సౌకర్యం ఉందని సంధ్య యాజమాన్యం తెలియజేసింది. కాగా, ప్రస్తుతం సెలవులో ఉన్న సీపీ సీవీ ఆనంద్‌ మంగళవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆ తర్వాతే సంధ్య యాజమాన్యం ఇచ్చిన వివరణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Dec 30 , 2024 | 04:23 AM