ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raksha Bandhan: కిటికీలోంచే రాఖీ

ABN, Publish Date - Aug 20 , 2024 | 04:24 AM

అక్కలతో రాఖీలు కట్టించుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన చిన్నారికి గురుకుల పాఠశాల సిబ్బంది చుక్కలు చూపించారు.

  • గురుకులంలో అక్క.. అనుమతివ్వని అధికారులు

  • తండ్రి భుజాలపైకి ఎక్కి కట్టించుకున్న తమ్ముడు

  • మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో ఘటన

రామకృష్ణాపూర్‌, ఆగస్టు 19: అక్కలతో రాఖీలు కట్టించుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన చిన్నారికి గురుకుల పాఠశాల సిబ్బంది చుక్కలు చూపించారు. బాలికల గురుకులంలోకి వచ్చేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వబోమని, కుదరదంటే కుదరదని తెగేసి చెప్పారు. రాఖీలు కట్టించుకుని వచ్చేస్తామని ఆ పిల్లాడి తండ్రి మొత్తుకున్నా వాళ్లు వినిపించుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి భుజాలపై ఎక్కి కూర్చొన చిన్నారికి.. కిటికీలో నుంచే ఆ ఇద్దరు అక్కలు రాఖీలు కట్టారు.


మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గురకులంలో దాసరి సహస్ర, అన్విక చదువుకుంటుండగా.. వారి తమ్ముడు, తండ్రికి ఈ పరిస్థితి ఎదురైంది. రక్షాబంధన్‌ రోజు పాఠశాలకు వచ్చిన సోదరులను సిబ్బంది అనుమతించకపోవడంపై పలువురు తల్లిదండ్రులు మండిపడ్డారు.

Updated Date - Aug 20 , 2024 | 04:24 AM

Advertising
Advertising
<