Zahirabad: అంధ విద్యార్థినికి ఐఐఎంలో సీటు...
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:42 AM
శారీరక లోపం జీవితంలో ఎదుగుదలకు, లక్ష్య సాధనకు అడ్డంకి కాదని నిరూపించింది ఆ యువతి. కళ్లు లేకపోయినా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి
జహీరాబాద్, జూన్ 20: శారీరక లోపం జీవితంలో ఎదుగుదలకు, లక్ష్య సాధనకు అడ్డంకి కాదని నిరూపించింది ఆ యువతి. కళ్లు లేకపోయినా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి ప్రఖ్యాత ఐఐఎం(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లో సీటు సాధించింది. జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలోని గడి ప్రాంతానికి చెందిన గోపాల్ రెడ్డి- విజయలక్ష్మి దంపతుల రెండో కూతురు శివాని.
అంధురాలైన శివాని.. ఐఐఎం ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐఎం కళాశాలల్లో 19 చోట్ల సీటు సాధించిందని ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇండోర్ ఐఐఎం కళాశాలలో శివాని చేరనన్నట్లు వారు తెలిపారు.
Updated Date - Jun 21 , 2024 | 03:42 AM