Secunderabad: ఆ ఎక్స్‌ప్రెస్ రైలు అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Apr 21 , 2024 | 10:00 AM
దానాపూర్ ఎక్స్‌ప్రెస్(Danapur Express) అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ పుడుతోంది. ఆ రైలులో కిక్కిరిసిపోతున్న రద్దీతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
- స్లీపర్ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులు..
- రిజర్వేషన్ చేసుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు
- ఫైన్ వేసి చేతులు దులుపుకుంటున్న టీసీలు
- దానాపూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు నరకం
సికింద్రాబాద్: దానాపూర్ ఎక్స్‌ప్రెస్(Danapur Express) అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ పుడుతోంది. ఆ రైలులో కిక్కిరిసిపోతున్న రద్దీతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. మరీ ముఖ్యంగా జనరల్ టికెట్లు తీసుకున్న వారు భారీ సంఖ్యలో స్లీపర్ బోగీల్లోకి ఎక్కుతుండడంతో.. స్లీపర్ టికెట్లు బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక బోగీలో 72 బెర్తులు ఉండగా.. 200 మంది వరకు జనరల్ టికెట్లు తీసుకున్న వారు అందులో ప్రయాణిస్తున్నారు. దీంతో స్లీపర్ టికెట్లు(Sleeper tickets) తీసుకున్న వారు కాళ్లు ముడుచుకొని కూర్చుంటున్నారు.
ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే.. పార్టీ మారరని చెప్పగలరా?
తాము ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్ధితి నెలకొందని రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వాపోతున్నారు. కళ్లముందే జనరల్ టికెట్ తీసుకున్న వారు స్లీపర్ బోగీల్లో ఎక్కుతున్నా.. టికెట్ ఎగ్జామినర్లు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. వారు బోగీల్లోకి ఎక్కాక చలాన్లు విధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. రద్దీకి అనుగుణంగా రైలుకు అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని.. లేదా జనరల్ టికెట్లు తీసుకున్న వారు స్లీపర్ బోగీల్లోకి ఎక్కకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రిమాండ్ ఖైదీ కడుపులో ఇనుప మేకులు...
Updated Date - Apr 21 , 2024 | 10:00 AM