ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీతక్క

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:30 AM

ఏపీలోని వియజవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని వియజవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతక్కను ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.


కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీనే..

ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని సీతక్క వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జిల్లా గుంటుపల్లిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆమెకు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్‌ స్వాగతం పలికి కొండపల్లి బొమ్మను బహూకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి నేతృత్వంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 03:30 AM