Transfer Issue: వైద్య కళాశాల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలి
ABN, Publish Date - Jul 20 , 2024 | 04:37 AM
వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్‌ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు.
సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు
అడ్డగుట్ట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్‌ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు తమ సమస్యల్ని వివరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి గాంధీ సీనియర్ రెసిడెంట్ విద్యార్థులు లేఖ రాశారు.
ఆయా విభాగాల్లో మొత్తం బోఽధనా సిబ్బంది ఒకేసారి బదిలీ అయ్యారని, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు వచ్చే అవకాశం లేదని వారు అన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి వైద్య విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖల తరహాలో వైద్యవిద్య బోధనా సంస్థల్లో బదిలీలను పరిగణించవద్దని వారు కోరారు.
Updated Date - Jul 20 , 2024 | 04:37 AM