ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Trapping Case: రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలనం.. తొలిసారిగా వెలుగులోకి కేసీఆర్ పేరు

ABN, Publish Date - May 03 , 2024 | 10:17 AM

టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) పేరును పలుమార్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధా కిషన్ రావు వెల్లడించారు.

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది


ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్‌రావు వెల్లడించే వివరాల ఆధారంగా రాజకీయ నేతలతో పాటు వారికి ఆర్థికంగా సహాయం చేసే వారిని లొంగదీసుకున్నామని తెలిపారు. సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్ చేస్తూ ఎన్నికల సమయంలో వారి నగదును అడ్డుకున్నామని రాధా కిషన్‌రావు తెలిపారు. బీఆర్ఎస్‌కు చెందిన నగదు తరలింపులో తాము సహకరించినట్టు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు వెల్లడించారు. 2017 లో ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించడంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని తెలిపారు.

Loksabha Polls 2024: ఉత్తరప్రదేశ్ బయలుదేరిన సీఎం రేవంత్


బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు చక్కదిద్దేందుకే తనను ఏరీ కోరి టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించినట్టు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియామకం తర్వాత కేసీఆర్ అత్యంత సన్నిహితుల కార్యకలాపాలను చెక్కబెట్టేవాడినని రాధా కిషన్ రావు తెలిపారు. అధికార పార్టీ నగదు రవాణాకు ప్రణీత్ రావుతో సమన్వయం చేసుకోవాలని ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చేవాడని వెల్లడించారు. కేసీఆర్‌కు లబ్ధి చేకూరేలా ప్రభాకర్ రావు ప్రత్యేక పనులు తనకు అప్పగించేవాడన్నారు. అడిషనల్ ఎస్పీ భుజంగరావు ప్రతి విషయాన్ని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా వెళ్లి సమాచారం ఇచ్చేవాడని రాధా కిషన్ రావు వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి...

Kim Jong Un: ఏడాదికి 25 మంది అందమైన కన్యలతో కిమ్ జాంగ్ ఉన్‌కు ‘ప్లెజర్ స్క్వాడ్’

Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2024 | 10:17 AM

Advertising
Advertising