ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Job Notification: నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్లకు పీఈటీల ఫలితాలు!

ABN, Publish Date - Aug 22 , 2024 | 03:16 AM

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా గురుకులాల్లోని 594 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌(పీఈటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు బుధవారం ప్రకటించారు.

  • 594 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా గురుకులాల్లోని 594 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌(పీఈటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీ కోసం 2017 ఏప్రిల్‌ 14న నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గతంలోనే పరీక్షలను నిర్వహించారు.


మధ్యలో న్యాయపరమైన వివాదాలు చోటు చేసుకోవడంతో ఫలితాల ప్రకటనలో జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. అంటే... నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత ఫలితాలను ప్రకటించారు. భర్తీలో తీవ్ర జాప్యం జరిగినందున పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో చేరి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులను వద్దనుకునే అభ్యర్థులు 22 నుంచి 24 తేదీల మధ్య తమకు ఉద్యోగం వద్దనివెబ్‌సైట్‌లో పొందుపరచాలని అధికారుల సూచించారు. ఇలా వదులుకునే పోస్టుల్లో మెరిట్‌ జాబితాలోని దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Aug 22 , 2024 | 03:16 AM

Advertising
Advertising
<