ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shantikumari: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ను ప్లాస్టిక్‌రహిత జోన్‌గా మార్చాలి..

ABN, Publish Date - May 30 , 2024 | 04:24 AM

జూలై నెలాఖరులోగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ను పూర్తిగా ప్లాస్టిక్‌రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

  • అందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి

  • అధికారులకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): జూలై నెలాఖరులోగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ను పూర్తిగా ప్లాస్టిక్‌రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ను ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, అటవీ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సీఎస్‌ సమావేశమై చర్చించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కాగితం, కాటన్‌/జనపనార సంచులు, విస్తరాకులు వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియాలలో ప్రచారంతోపాటు పంచాయతీల్లో, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో ఉంటున్న వారిని తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

Updated Date - May 30 , 2024 | 04:24 AM

Advertising
Advertising