Urban development: పట్టణ ప్రగతికి 15,594 కోట్లు..
ABN, Publish Date - Jul 26 , 2024 | 03:53 AM
పురపాలక, పట్టణాభివృద్ధికి బడ్జెట్‌లో సర్కారు రూ.15,594 కోట్లు కేటాయించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరిపారు.
హైదరాబాద్, జూలై 25(ఆంధ్రజ్యోతి): పురపాలక, పట్టణాభివృద్ధికి బడ్జెట్‌లో సర్కారు రూ.15,594 కోట్లు కేటాయించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరిపారు. అయితే ఇందులో హైదరాబాద్ నగరాభివృద్ధికే గణనీయంగా రూ.10 వేల కోట్ల (65 శాతం) వరకు కేటాయింపులున్నాయి. ఇక యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.50 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం కింద పురపాలక సంఘాలకు రూ.1,300 కోట్లు, వైకుంఠధామాల నిర్మాణాలకు రూ.75 కోట్లు, సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించారు.
మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో వడ్డీలేని రుణాల కోసం రూ.142 కోట్లు, పురపాలక శాఖలో వివిధ పనుల నిమిత్తం రూ.2,305 కోట్లు.. పారిశుధ్యం, ప్రజారోగ్య విభాగాలకు రూ.525 కోట్లు కేటాయించారు. మిషన్ భగీరథ పథకానికి గత బడ్జెట్‌లో రూ.900 కోట్ల కేటాయింపులుండగా.. రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు.
Updated Date - Jul 26 , 2024 | 03:53 AM